Site icon HashtagU Telugu

Raviteja Mr Bacchan : మిస్టర్ బచ్చన్ తేడా కొడుతున్న బిజినెస్ లెక్కలు..!

Interesting Title for Raviteja 75th Movie

Interesting Title for Raviteja 75th Movie

Mass Maharaj Raviteja మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. క్రాక్ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వచ్చిన మాస్ రాజా ధమాకా (Dhamaka)తో బంపర్ హిట్ కొట్టాడు. అయితే ఆ తర్వాత అన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. రవితేజ సినిమా హిట్ పడితే ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. అందుకే ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు మాస్ రాజా.

ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ (Mr Bacchan Movie) సినిమా చేస్తున్న రవితేజ ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేశాడు. ఈ సినిమాను రెమ్యునరేషన్స్ అన్నీ కలుపుకుని ముందు 70 కోట్లకు అటు ఇటుగా పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సినిమా కోసం దాదాపు 90 కోట్ల దాకా ఖర్చు పెట్టారట. ఐతే సినింజా బిజినెస్ లెక్కలు చూస్తే పెట్టిందే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. రవితేజ సినిమా థియేట్రికల్ బిజినెస్ 30 కోట్లు ఈజీగా అవుతుంది. ఐతే ఓటీటీ రూపంలో 20, హిందీ రైట్స్ రూపంలో మరో పాతిక రాబట్టారట.

శాటిలైట్ రైట్స్ కూడా ఐదారు కోట్లు పలుకుతాయని అంటున్నారు. ఐతే మొత్తం బిజినెస్ లెక్కలు చూస్తే 80 కోట్ల దగ్గరకు వచ్చి ఆగుతున్నాయట. అంటే 10 కోట్లు ఇంకా లాస్ లోనే ఉన్నారన్నమాట. అదే ముందు పేపర్ మీద అనుకున్న 70 కోట్ల లోపు సినిమా కంప్లీట్ చేసి ఉంటే కచ్చితంగా ప్రాఫిటబుల్ వెంచర్ అయ్యేది.

రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా ప్రచార చిత్రాలైతే సినిమపై మంచి బజ్ పెంచేస్తున్నాయి. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Also Read : Raja Saab : రాజా సాబ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ పక్కానా..?