Raviteja Mister Bacchan : ఇడియట్ ని గుర్తు చేస్తున్న మిస్టర్ బచ్చన్.. రవితేజ ఏదో చేసేలా ఉన్నాడే..!

Raviteja Mister Bacchan మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ ఈ కాంబో సినిమా అంటే ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అన్నట్టే లెక్క. హరీష్ శంకర్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది రవితేజనే కాబట్టి ఆ హీరో

Published By: HashtagU Telugu Desk
Raviteja Mister Bacchan Poster Like Idiot Poster

Raviteja Mister Bacchan Poster Like Idiot Poster

Raviteja Mister Bacchan మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ ఈ కాంబో సినిమా అంటే ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అన్నట్టే లెక్క. హరీష్ శంకర్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది రవితేజనే కాబట్టి ఆ హీరో మీద హరీష్ ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తూనే ఉంటాడు. అంతెందుకు రవితేజకు మాస్ మహరాజ్ అనే ట్యాగ్ ఇచ్చింది కూడా ఆయనే. అందుకే ఈ ఇద్దరు ఎప్పుడు కలిసి సినిమా చేసినా అదో రకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ హరీష్ శంకర్ తో రవితేజ సినిమా చేస్తున్నారు.

మిస్టర్ బచ్చన్ అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత బజ్ పెంచింది. హీరోయిన్ ని తన బిగి కౌగిలిలో బంధిస్తూ మాస్ రాజా అదరగొట్టాడు. ఈ పోస్టర్ చూస్తే రవితేజ ఇడియట్ సీన్ గుర్తుకు రాక మానదు. ఇడియట్ సినిమాలో కూడా ఇలానే హీరోయిన్ ను నడుము దగ్గర గట్టిగా పట్టేసుకుంటాడు రవితేజ.

ఇప్పుడు మిస్టర్ బచ్చన్ లో కూడా హీరోయిన్ భాగ్య శ్రీ ని గట్టిగా చుట్టేసుకున్నాడు. రీసెంట్ గా ఈగల్ తో మరోసారి తన మార్క్ మాస్ సినిమా ఫ్యాన్స్ కి అందించిన రవితేజ ఇక మీదట మరింత దూకుడుగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ వేగం చూస్తుంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ ఉండేలా ఉంది. ఇక మరోపక్క ఈగల్ 2 యుద్ధ కాండ ఉంది. ఆ సినిమాతో పాటుగా మరో రెండు ప్రాజెక్ట్ లు కూడా లైన్ లో ఉన్నాయి.

  Last Updated: 14 Feb 2024, 05:15 PM IST