Raviteja Mister Bacchan : మిస్టర్ బచ్చన్ మల్టీస్టారర్.. రవితేజతో ఆ హీరో స్క్రీన్ షేరింగ్..?

Raviteja Mister Bacchan మాస్ మహరాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ కు రెడీ

Published By: HashtagU Telugu Desk
Another Hero in Mass Maharaj Raviteja Mr Bacchan

Another Hero in Mass Maharaj Raviteja Mr Bacchan

Raviteja Mister Bacchan మాస్ మహరాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగానే మరో సినిమా సెట్స్ మెదకు తీసుకెళ్తాడు. ఈగల్ రిలీజ్ అవ్వకుండానే మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు రవితేజ.

We’re now on WhatsApp : Click to Join

ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. హరీష్ శంకర్ కి మొదటి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. ఆ కృతజ్ఞత ఎప్పుడు చూపిస్తుంటాడు. వీరి కాంబో సినిమా చాలా రోజులుగా డిస్కషన్ లో ఉన్నా ఫైనల్ గా మిస్టర్ బచ్చన్ షురూ అయ్యింది.

ఈ సినిమా నుంచి లేటెస్ట్ న్యూస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. సినిమాలో కేవలం రవితేజ మాత్రమే కాదు మరో హీరో కూడా ఉంటాడని టాక్. అతనెవరో కాదు ఘట్టమనేని హీరో సుధీర్ బాబు అని తెలుస్తుంది. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో సుధీర్ బాబు నటిస్తున్నాడని లేటెస్ట్ టాక్. అయితే సినిమాలో ఆ హీరో పాత్ర ఎంత ఉంటుందన్నది తెలియాల్సి ఉంది.

సినిమాలో సుధీర్ బాబు ఉన్నాడా లేడా అన్నది కూడా డౌటే అని తెలుస్తుంది. అయితే ఓ పక్క సుధీర్ బాబు సోలో సినిమాలు చేస్తూనే మరోపక్క విలన్ గా చేసేందుకు సై అనేస్తున్నాడు. సుధీర్ బాబు బాలీవుడ్ లో బాగి సినిమాలో విలన్ గా కూడా నటించాడు. అయితే తెలుగులో విలన్ గా నటించాలంటే మాత్రం సరైన సబ్జెక్ట్ ఉండాలని అనుకుంటున్నాడు. మరి రవితేజ సినిమాలో సుధీర్ బాబు పాత్రపై త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు.

Also Read : Adivi Sesh : అడివి శేష్ మీద 150 కోట్ల బడ్జెట్.. ఆ రెండిటి మీద భారీగా పెట్టేస్తున్నారు..!

  Last Updated: 25 Jan 2024, 05:24 PM IST