టాలీవుడ్ మాస్ రాజా రవితేజ (Raviteja) గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఖిలాడి’ సినిమాలో నటించిన రవితేజ, హీరోయిన్ మీనాక్షి చౌదరితో లిప్‌లాక్ (Raviteja – Meenakshi Lip Lock) సీన్ కావాలని దర్శకుడిని అడిగి మరీ చేర్చించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సీన్ కథకు అవసరం లేకపోయినా, రవితేజ కోరడంతోనే చేర్చినట్లు సోషల్ మీడియాలో ఓ వర్గం పేర్కొంటోంది. దీంతో ఈ వార్తపై సినీప్రపంచంలో చర్చలు మొదలయ్యాయి.
అయితే ఈ ప్రచారాన్ని రవితేజ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. “మా హీరో అలాంటి వ్యక్తి కాదు, అనవసర సీన్ల కోసం ఒత్తిడి చేయరు” అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు గతంలో ఓ ఇంటర్వ్యూలో రవితేజ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్త, “స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత కథలో జోక్యం చేయను. హిట్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో పట్టించుకోను. ఏ సినిమా అయినా ఒకసారి ప్రారంభమైతే, కథలో మార్పులు చేయడం నాకు ఇష్టం ఉండదు” అని రవితేజ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న లిప్‌లాక్ వివాదం వెనక ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని పుకార్లు పేర్చే సోషల్ మీడియా ట్రెండ్నే భాగంగా భావించవచ్చు. రవితేజ పాత్రను నలుగురికీ తక్కువగా చూపేందుకు కావాలనే ఎవరో ఈ దుష్ప్రచారాన్ని సాగిస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. మరి నిజం ఏంటి అనేది డైరెక్టరే చెప్పాలి.