Site icon HashtagU Telugu

Tiger Nageswara Rao: రవితేజ మాస్ ట్రీట్, టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ డేట్ ఫిక్స్

Raviteja Tiger Nageswara Rao Movie First Look and Glimpse Released

Raviteja Tiger Nageswara Rao Movie First Look and Glimpse Released

మాస్ మహారాజా రవితేజ “టైగర్ నాగేశ్వరరావు”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాలిడ్ హైప్ ఉన్న ఈ చిత్రానికి దర్శకుడు వంశీ దర్శకత్వం వహిస్తుండగా, క్రేజీ అప్‌డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ ధృవీకరించారు. ఇక ఇప్పుడు ఈ బిగ్ అప్ డేట్ ని రివీల్ చేస్తూ ఆగస్ట్ 17న దండయాత్ర అనే పోస్టర్ తో రిలీజ్ చేయనున్నట్టు టైగర్ నాగేశ్వరరావు మేకర్స్ తెలిపారు.

దీంతో వచ్చే వారం నుంచి ఈ సినిమా నుంచి భారీ ట్రీట్ ప్రారంభం కానుందని చెప్పాలి. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ నాపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పలువురు అగ్రనటులు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. అలాగే అక్టోబర్ 20న గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్ గా ఫిక్స్ చేశారు.

(Ravi Teja) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్, ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. సరికొత్త ప్రాజెక్ట్స్ తో యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దుమ్ములేపుతున్నారు. ఇటీవల వరుసగా హిట్లు అందుకుంటూ మాస్ సత్తా చూపిస్తున్నారు. చివరిగా ‘వాల్తేరు వీరయ్య’తో అలరించారు. ఆ తర్వాత క్రైమ్ బేస్డ్ మూవీ ‘రావణసుర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం మాస్ మాహారాజా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’తో రాబోతున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేసింది యూనిట్.