ass Jathara : మాస్ మహారాజ్ రవితేజ ధమాకా తర్వాత మళ్ళీ హిట్ కొట్టలేదు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా సినిమా కంటెంట్ బాగున్నా ఎందుకో ఫెయిల్ అవుతున్నాయి. ప్రస్తుతం రవితేజ తన కెరీర్ లో 75వ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ 75వ సినిమా ‘మాస్ జాతర’ తెరకెక్కుతుంది.
నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. మీరు కూడా ఈ గ్లింప్స్ చూసేయండి..
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. గ్లింప్స్ లో మాస్ వింటేజ్ రవితేజని సినిమాలో చూస్తారని ప్రకటించారు. మాస్ ఎలివేషన్స్, పోలీసాఫీసర్ గా యాక్షన్ సీన్స్, రవితేజ కామిక్ ఎక్స్‌ప్రెషన్స్.. ఇలా ఫుల్ ఎనర్జీగా చూపించారు. దీంతో ఈ సినిమాతో రవన్న మంచి కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read : Padma Bhushan : బాలకృష్ణ కు అభినందనల వెల్లువ