Site icon HashtagU Telugu

Raviteja Injured : షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ..

Raviteja Injured

Raviteja Injured

మాస్ మహారాజా రవితేజ షూటింగ్ లో గాయపడ్డారు..ఈ ప్రమాదం లో ఆయనకు 12 కుట్లు పడ్డాయి. ఈ విషయాన్ని నిర్మాత అభిషేక్ తెలిపారు. ధమాకా (Dhamaka),వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ..ఆ తర్వాత రావణాసుర (Ravanasuraa) తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం వంశీ (Vamsee) డైరెక్షన్లో టైగర్‌ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) మూవీ చేసాడు. 1970 కాలంలో స్టూవర్ట్‌పురం (stuartpuram )లో పాపులర్‌ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్‌ రావు (Tiger nageswara rao) జీవిత కథ నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్‌ సనన్‌ టాలీవుడ్‌ డెబ్యూ ఇస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్‌ ఖేర్ (Anupam Kher) ‌, మురళీ శర్మ, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా సందర్బంగా అక్టోబర్ 20న పాన్ ఇండియా గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమా ఫై మరింత అంచనాలు పెంచుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో రవితేజ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. సినిమాలో ట్రైన్ దోపిడీ సీన్ చేస్తుప్పుడు ట్రైన్ మీద నుంచి లోపలి దూకే షాట్ ఉంటుంది. ఆ షాట్ లో అదుపు తప్పి రవితేజ కింద పడ్డారు. మోకాలికి కొద్దిగా పైన బాగా దెబ్బ తగిలింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. ఆపరేషన్ చేసి 12 కుట్లు వేశారు. ఆ షాట్ లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. షూట్ ఎక్కువ రోజులు వాయిదా వేస్తే నిర్మాతకు నష్టం అని ఆలోచించి రెండు రోజుల్లో మళ్ళీ షూట్ కి వచ్చారు. పూర్తిగా నయమయ్యేదాకా రెస్ట్ తీసుకోమని నేను, డైరెక్టర్ చెప్పినా బడ్జెట్ పెరిగిపోతుందని షూట్ కి వచ్చేశారు. సినిమాపై ఆయనకు అంత డెడికేషన్ ఉంది అని అన్నారు. ఈ విషయం తెలిపి ఇప్పుడు అభిమానులు రవితేజ ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also : Venkaiah Naidu : ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు