Site icon HashtagU Telugu

RT4GM : రవితేజ గోపీచంద్ సినిమా పూజా కార్యక్రమాలతో షురూ.. నాలుగో సారి హిట్ రెడీ..

Raviteja Gopichand Malineni fourth Film RT4GM started with Pooja Ceremony

Raviteja Gopichand Malineni fourth Film RT4GM started with Pooja Ceremony

రవితేజ(Raviteja) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు. త్వరలో సంక్రాంతికి ఈగల్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్నాడు రవితేజ. గతంలో రవితేజ -గోపీచంద్ మలినేని(Gopichand Malineni) కాంబోలో డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు వచ్చి మంచి విజయాలు సాధించాయి.

వీరిద్దరి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఇప్పుడు ఇంకో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఇటీవల RT4GM అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సినిమాలో ఇందూజ రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తుండగా సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతం అందించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది. దీంతో ఈసారి కూడా ఈ కాంబో హిట్ కొడుతుందని భావిస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు.

 

Also Read : Pooja Hegde: రేంజ్ రోవర్ కారును కోనుగోలు చేసిన పూజాహెగ్డే, రేటు ఎంతో తెలుసా