Raviteja : మహేష్ అల్లు అర్జున్ బాటలో రవితేజ..!

Raviteja స్టార్ హీరోలంతా కూడా కేవలం సినిమాలతోనే కాకుండా వేరే ఆదాయ మార్గాలను కూడా చూసుకుంటున్నారు. తమకు వచ్చే రెమ్యునరేషన్ ని ఇన్వెస్ట్ మెంట్ గా మార్చి బిజినెస్ లు

Published By: HashtagU Telugu Desk
Raviteja Following Mahesh Babu and Allu Arjun

Raviteja Following Mahesh Babu and Allu Arjun

Raviteja స్టార్ హీరోలంతా కూడా కేవలం సినిమాలతోనే కాకుండా వేరే ఆదాయ మార్గాలను కూడా చూసుకుంటున్నారు. తమకు వచ్చే రెమ్యునరేషన్ ని ఇన్వెస్ట్ మెంట్ గా మార్చి బిజినెస్ లు చేస్తున్నారు. అయితే వేరే ఏదో తెలియని బిజినెస్ ఎందుకు సినిమాల్లో సంపాదిస్తున్నాం కాబట్టి సినిమాలకే పెట్టేద్దామని కొందరు నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంటారు. మరోపక్క థియేటర్లు కట్టి నడిపిస్తుంటారు. మహేష్ ఇప్పటికే ఏ.ఎం.బి మాల్ కట్టించిన విషయం తెలిసిందే.

ఏషియన్ సినిమాస్ వారితో కలిసి మహేష్ AMB మాల్ నిర్మించాడు. అది సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఇక మహేష్ బాటలోనే అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్ తో కలిసి సత్యం థియేటర్ ని కొనేసి AAA సినిమాస్ అని రెడీ చేశాడు. అది కూడా బాగానే రన్ అవుతుంది. విజయ్ దేవరకొండతో ఏషియన్ సినిమాస్ కలిసి ఏవిడి అనే మల్టీప్లెక్స్ నిర్మించారు.

ఇక ఇప్పుడు రవితేజ కూడా ఏసియన్ వారితో చేతులు కలిపి దిల్ షుక్ నగర్ లో ఒక మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారట. ఆరు స్క్రీన్స్ తో తయారు చేస్తున్న ఈ మల్టీప్లెక్స్ భారీ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. సో రవితేజ కూడా థియేటర్ బిజినెస్ లోకి వచ్చేశాడు. రవితేజతో కలిసి ఏషియన్ సినిమాస్ వారు ART అనే మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది..

ఇక సినిమాల విషయానికి వస్తే ఈమధ్యనే రవితేజ ఈగల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేడు. హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Also Read : Venkatesh Trisha : వెంకటేష్.. త్రిష.. సూపర్ హిట్ కాంబో రిపీట్..!

  Last Updated: 22 Feb 2024, 11:05 AM IST