Site icon HashtagU Telugu

Raviteja : రవితేజకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన హనుమాన్.. మీ వల్ల మాకు ఇబ్బందులే అంటున్న తేజా సజ్జ..!

Raviteja Eagle Teja Sajja Hanuman Special Interview

Raviteja Eagle Teja Sajja Hanuman Special Interview

Raviteja ఈ సంక్రాంతికి హనుమాన్ అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్న తేజా సజ్జా తన నెక్స్ట్ సినిమాను కూడా భారీ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది. ఇక హనుమాన్ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కోతి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చాడని తెలిసిందే. హనుమాన్ సినిమాలో రవితేజ వాయిస్ స్పెషల్ సర్ ప్రైజ్ అందించింది.

We’re now on WhatsApp : Click to Join

ఇక ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు చిత్ర యూనిట్ రవితేజకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హనుమాన్ టీం అంతా కూడా రవితేజ మీద తమ అభిమానాన్ని చూపించారు.

ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ఈగల్ సినిమా రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో హనుమాన్ హీరో తేజ సజ్జ పాల్గొన్నాడు. రవితేజతో హనుమాన్ హీరో తేజా సజ్జ స్పెషల్ చిట్ చాట్ చేశారు. సినిమాకు సంబందించిన విషయాలతో పాటుగా రవితేజ అంటే తేజా సజ్జాకి ఎంత ఇష్టమో చెప్పారు.

రవితేజ వల్ల తమలాంటి యువ హీరోలకు ఇబ్బంది అవుతుందని అన్నాడు తేజ సజ్జ. మీరేమో ఏడాదికి 3 సినిమాలు చేస్తుంటారు. ఆ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ తీసుకుంటారు. ఎవరిని అడిగినా సరే రవితేజ సినిమా చేస్తున్నామని అంటారు. అలా మాలాంటి యువ హీరోలకు ఇబ్బంది అవుతుందని అన్నారు తేజ సజ్జ.

Also Read : Prabhas Kannappa : ప్రభాస్ ది మరీ ఇంత జాలి హృదయమా.. ఫ్రెండ్ షిప్ కోసం ఇంత చేస్తున్నాడా..?

రవితేజని చూసే ఆయనలా కష్టపడితే తప్పకుండా ఎప్పటికైనా తాము కూడా సక్సెస్ సాధిస్తామని స్పూర్తిగా నిలిచారని తేజా సజ్జా అన్నాడు. ప్రస్తుతం తేజా సజ్జ రవితేజ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.