Raviteja సంక్రాంతికి ఐదు సినిమాల రిలీజ్ ప్లాన్ చేయగా వాటిలో ఏదో ఒక రెండు సినిమాలు ఆపాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంతా కలిసి ఫైనల్ గా ఒక సినిమాను రిలీజ్ వాయిదా వేసేలా చేశారు. సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్, నాగార్జున నా సామిరంగ సినిమాలతో పాటుగా హనుమాన్ సినిమా కూడా రిలీజ్ లాక్ చేశారు. కానీ ఫైనల్ గా ఈగల్ సినిమాను వాయిదా వేసుకున్నారు.
We’re now on WhatsApp : Click to Join
రవితేజ ఈగల్ ని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాను సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ చేసి ఫిబ్రవరి 9కి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. సంక్రాంతి నుంచి సినిమాను వాయిదా వేస్తున్నందుకు ఫిబ్రవరి 9న ఈగల్ ని సోలో రిలీజ్ కు ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాను చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నందుకు నిర్మాతలకు నిర్మాత దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.
ఈగల్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా పీపుల్ మీడియా బ్యానర్ నిర్మించారు. సినిమా రిలీజ్ వాయిదా వేయడం మాస్ రాజా ఫ్యాస్ కి అసంతృప్తిగా అనిపించినా ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ వల్ల కచ్చితంగా లాభం చేకూరుతుందని చెప్పొచ్చు. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈగల్ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై బజ్ పెంచాయి.
డీజే టిల్లు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా కూడా కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తుంది. ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్ లాక్ చేయగా సంక్రాంతికి తమ సినిమాను వాయిదా వేస్తున్నందుకు గాను టిల్లు స్క్వేర్ సినిమాను మరోసారి వాయిదా వేయక తప్పట్లేదు.
Also Read : Shortest Test: కేవలం 642 బంతుల్లోనే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి..!