Site icon HashtagU Telugu

Raviteja : ఓ పక్కన ‘ఈగల్’ హిట్.. మరో పక్క అప్పుడే ‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి..

Raviteja Eagle Movie in Theaters Mr Bachchan Shooting Shedule Wrap fast working by People media Factory

Raviteja Eagle Movie in Theaters Mr Bachchan Shooting Shedule Wrap fast working by People media Factory

మాస్ మహారాజ రవితేజ(Raviteja) ఫిబ్రవరి 9న ‘ఈగల్'(Eagle) సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. స్టైలిష్ మాస్ యాక్షన్ గా వచ్చిన ఈగల్ థియేటర్స్ లో అదరగొడుతుంది. ఇప్పటికే ఈ సినిమా రెండు రోజుల్లో 20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఓ పక్కన రవితేజ ఈగల్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి నడుస్తుండగానే మరో పక్క నెక్స్ట్ సినిమా ‘మిస్టర్ బచ్చన్'(Mr Bachchan) షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసేసాడు.

హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో ఈగల్ సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మాణంలోనే మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కుతుంది. హిందీ సినిమా రైడ్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తయిందని. ఈ షెడ్యూల్ నాకు చాలా సంతృప్తినిచ్చింది అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసాడు. దీంతో హరీష్ పోస్ట్ వైరల్ గా మారింది.

రవితేజ ఫాస్ట్ గా సినిమాలు చేస్తాడని తెలిసిందే. ఓ పక్క థియేటర్ లో సినిమా రిలిజ్ అవ్వగానే మరో పక్క నెక్స్ట్ సినిమా షెడ్యూల్స్ కూడా పూర్తవుతున్నాయి. ఇక ఈ రెండిటి నిర్మాణ సంస్థ ఒకటే కావడం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే . రవితేజతో ఇప్పటికే ధమాకా సూపర్ హిట్, ఇప్పుడు ఈగల్ హిట్ అందుకుంది. త్వరలో మిస్టర్ బచ్చన్ తో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడతామని అంటున్నారు నిర్మాతలు.

 

 

Also Read : Harish With Balayya: బాలయ్య హరీష్ క్రేజీ కాంబో.. బాక్సాఫీస్ షేక్