Site icon HashtagU Telugu

Raviteja Eagle Making Video : ఈగల్ మేకింగ్ వీడియో.. ఈ కష్టం చూసైనా సినిమా హిట్ చేయాల్సిందే..!

Raviteja Eagle Making Video Released

Raviteja Eagle Making Video Released

Raviteja Eagle Making Video మాస్ మహరాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించారు. దేవ్ జాండ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ నటించారు. సినిమా ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించగా మాస్ రాజా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే రిలీజ్ దగ్గర పడుతున్న ఈ టైం లో సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేకింగ్ వీడియో చూస్తే సినిమా కోసం వారంతా ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. రవితేజ నుంచి వస్తున్న మరో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈగల్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ అంతా సినిమా మీద సూపర్ కాన్ ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.

రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత తర్వాత రెండు సినిమాలు చేయగా అవి కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఈసారి హిట్టు టార్గెట్ తో ఈగల్ తో వస్తున్నాడు. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని చాలా క్లారిటీతో ఉన్నాడు. సినిమా తప్పకుండా వర్క్ అవుట్ అయ్యేలా ఉంటుందని చెప్పొచ్చు.

Also Read : Ranveer Singh Animal Review : యానిమల్ కి రణ్ వీర్ రివ్యూ.. డైరెక్టర్ షాక్ అయ్యేంతగా మెసేజ్..!