Site icon HashtagU Telugu

Eagle First Day Collections : రవితేజ ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. హిట్ కొట్టాలంటే ఎంత రాబట్టాలి..?

Raviteja Eagle Digital Streaming on Two OTT's

Raviteja Eagle Digital Streaming on Two OTT's

Eagle First Day Collections మాస్ మహరాజ్ రవితేజ లీడ్ రోల్ లో కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. దేవ్ జాండ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్, బిజిఎం కొత్తగా ఉంటాయని ఆడియన్స్ అంటున్నారు.

ఈ సినిమా 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వగా నైజాం లో 6 కోట్లు, సీడెడ్ లో 2.50 కోట్లు, ఏపీలో మిగతా ఏరియాలన్నీ కలిపి 8.50 కోట్ల దాకా బిజినెస్ చేసింది. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా 2 కోట్లు. ఓవర్సీస్ మరో 2 కోట్లు బిజినెస్ చేసింది.

ఇక సినిమా ఫస్ట్ డే 4.20 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాల్లో కలిపి 4.80 కోట్ల దాకా వసూళు చేసింది. రవితేజ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈగల్ సినిమా హిట్ కొట్టాలి అంటే మరో 17 కోట్ల పైన రాబట్టాల్సి ఉంటుంది. అయితే సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. మరి ఈ టాక్ తో ఆ రేంజ్ వసూళ్లు రాబడతారా లేదా అన్నది చూడాలి.

Also Read : Krithi Shetty Belly Dance : బెల్లీ డాన్స్ తో బీభత్సం సృష్టిస్తున్న బేబమ్మ.. సోషల్ మీడియాలో రచ్చ..!