Raviteja Eagle : ఈగల్ ఒకేసారి రెండు ఓటీటీల్లో రిలీజ్..!

Raviteja Eagle మాస్ మహారాజ్ రవితేజ కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఈగల్. ఈ సినిమా థియేట్రికల్ వర్షన్ ఫిబ్రవరి 9న రిలీజ్ కాగా ఆశించిన స్థాయిలో సినిమా

Published By: HashtagU Telugu Desk
Raviteja Eagle Digital Streaming on Two OTT's

Raviteja Eagle Digital Streaming on Two OTT's

Raviteja Eagle మాస్ మహారాజ్ రవితేజ కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఈగల్. ఈ సినిమా థియేట్రికల్ వర్షన్ ఫిబ్రవరి 9న రిలీజ్ కాగా ఆశించిన స్థాయిలో సినిమా రిజల్ట్ అందుకోలేదు. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ లాక్ చేశారు మేకర్స్.

ఈ సినిమా ఇప్పటికే ఈటీవీ విన్ లో రిలీజ్ అనౌన్స్ చేయగా.. లేటెస్ట్ గా మరో ఓటీటీ సంస్థ కూడా ఈగల్ రిలీజ్ అనౌన్స్ చేసింది. అమేజాన్ ప్రైం లో కూడా ఈగల్ మార్చి 2 నుంచి అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. ఈగల్ ఒకేసారి అటు అమేజాన్ ప్రైం సబ్ స్క్రైబర్స్ కు.. ఇటు ఈటీవీ విన్ సన్ స్క్రైబర్స్ ముందుకు రానుంది.

రవితేజ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాకు దేవజాండ్ మ్యూజిక్ అందిచగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా నిర్మించబడింది.

  Last Updated: 26 Feb 2024, 08:29 PM IST