Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ గ్లింప్స్ వచ్చేసింది.. హరీష్ శంకర్ అదరగొట్టేసాడుగా..

రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ గ్లింప్స్ వచ్చేసింది. బాలీవుడ్ హిట్ మూవీ 'రైడ్'కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్..

  • Written By:
  • Updated On - June 17, 2024 / 05:02 PM IST

Mr Bachchan : షాక్, మిరపకాయ్ సినిమాలు తరువాత హరీష్ శంకర్, రవితేజ మరోసారి కలిసి చేస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’కి రీమేక్ గా వస్తుంది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా.. 1980లో జరిగిన ఓ ఇన్కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా రూపొందుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన ఈ చిత్రం.. ఇప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

సినిమాలను శరవేగంగా పూర్తీ చేసే హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని కూడా సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. కేవలం ఫాస్ట్ గా పూర్తీ చేయడమే కాదు, క్వాలిటీలో కూడా వావ్ అనిపిస్తున్నారు. నేడు ఈ సినిమా నుంచి షో రీల్ అంటూ ఓ చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. ఎటువంటి డైలాగ్ లేకుండా వచ్చిన ఈ గ్లింప్స్ ని యాక్షన్ షాట్స్ తో నింపేశారు. అలాగే 1980’s బ్యాక్‌డ్రాప్ ని చాలా బాగా చూపించారు.

ఈ సినిమాలో రవితేజ జోడిగా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంటే జగపతిబాబు విలన్ గా కనిపించబోతున్నారు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. మరి మిరపకాయ్ తో బ్లాక్ బస్టర్ కాంబో అనిపించుకున్న రవితేజ, హరీష్ శంకర్.. ఈ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.