Site icon HashtagU Telugu

Raviteja Beautiful Fans : మాస్ రాజా సూపర్ ఫ్యాన్స్ వీళ్లు.. సీనియర్ సిటిజెన్స్ తో రవితేజ..!

Raviteja Beautiful Fans Super Photo Momment

Raviteja Beautiful Fans Super Photo Momment

Raviteja Beautiful Fans మాస్ మహారాజ్ కి ఉన్న ఫ్యాన్స్ లో ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఈతరం యూత్ కన్నా నిన్నటితరం వారికి రవితేజ గురించి బాగా తెలుసు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చిన రవితేజ ఇప్పుడు మాస్ మహారాజ్ గా ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. చిరంజీవి తర్వాత స్వయంకృషితో పైకొచ్చిన హీరోగా రవితేజ గురించి అందరు చెప్పుకుంటారు.

We’re now on WhatsApp : Click to Join

అలాంటి రవితేజ తన మార్క్ మాస్ సినిమాలతో పాటుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీస్తుంటాడు. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం కారంచెడులో షూటింగ్ జరుపుకుంటుంది. రవితేజ షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న కొంతమంది మహిళా సీనియర్ స్టిజెన్స్ కొందరు రవితేజని మీట్ అవ్వాలని అనుకున్నారు.

వాళ్లంతా కూడా రవితేజని కలవాలని ఒక చోట మీట్ అవ్వగా రవితేజ వచ్చేసరికి వాళ్లంతా భోజనం చేస్తున్నారని రవితేజ వెయిట్ చేసి మరీ వారితో ముచ్చటించారట. వారు కలిసి ఉన్న క్షణాలు మళ్లీ తిరిగి రావని అందుకే వారిని డిస్టర్బ్ చేయలేదని రవితేజ తన టీం తో అన్నారట.

ప్రస్తుతం రవితేజ వారితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రవితేజ తన సీనియర్ సిటిజెన్ ఫ్యాన్స్ చూసి ఇది మాస్ రాజా పవర్ అంటే అనేస్తున్నారు. రవితేజ ఈగల్ ఈ నెల 9న రిలీజ్ కు రెడీ అవుతుంది. సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read : NTR Likes Kumari Aunty Curries : ఎన్టీఆర్ కూడా కుమారి ఆంటీ కర్రీ ఫ్యానేనా..?