Site icon HashtagU Telugu

Raviteja Anudeep : రవితేజతో అనుదీప్.. ఆ క్రేజీ టైటిల్ పెట్టేస్తున్నారా..?

Onemore Raviteja Movie Canceld Mass Raja Fans Dissappointed

Onemore Raviteja Movie Canceld Mass Raja Fans Dissappointed

Raviteja Anudeep మాస్ మహరాజ్ రవితేజ జాతిరత్నాలు ఫేం అనుదీప్ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. రవితేజ ప్రస్తుతం చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ ని తీసుకుంటున్నారని టాక్. ఇదిలాఉంటే ఈ సినిమాకు టైటిల్ గా ఒకప్పటి క్రేజీ టైటిల్ ని లాక్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇంతకీ ఈ సినిమా టైటిల్ గా ఏది పెడుతున్నారు అంటే దొంగా పోలీస్ అని తెలుస్తుంది. ఒకప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన సినిమాకు ఈ టైటిల్ పెట్టారు. యువ హీరో నిఖిల్ కూడా ఆమధ్య ఇదే టైటిల్ తో సినిమా చేశారు. ఇప్పుడు అదే టైటిల్ తో అనుదీప్ సినిమా చేస్తున్నాడు. రవితేజ ఈ సినిమాలో దొంగగా కనిపిస్తారని టాక్.

పిట్టగోడతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ కెవి జాతిరత్నాలుతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేసిన అనుదీప్ కెవి నెక్స్ట్ సినిమా రవితేజతో ఫిక్స్ చేసుకున్నాడు. మాస్ రాజా మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా అదిరిపోతుందని అంటున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుండగా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో సినిమా రిలీజ్ చేసేలా చూస్తున్నారు.

Also Read : PVR Multiplex : హమ్మయ్య.. ఇకపై పీవీఆర్ మల్టీప్లెక్స్‌లలో యాడ్స్ గోల తగ్గినట్టే..?