రవితేజ(Raviteja) శ్రీలీల(Sreeleela) కలిసి గత సంవత్సరం థియేటర్స్ లో ధమాకా(Dhamaka) సినిమాతో అదరగొట్టేశారు. రవితేజ కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది ధమాకా. రవితేజ – శ్రీలీల మాస్ డ్యాన్సులు ఈ సినిమా సక్సెస్ కి మెయిన్ రీజన్. థియేటర్స్ లో శ్రీలీల రవితేజ డ్యాన్సులు, ఆ సాంగ్స్ చూసి ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ సినిమాతో శ్రీలీల స్టార్ హీరోయిన్ అయిపోయి ఏకంగా చేతిలో పది సినిమాలు పెట్టుకుంది. ఈ సినిమాతో శ్రీలీలకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది.
అయితే ఇప్పుడు ఇదే కాంబో మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. శ్రీలీల, రవితేజ కలిసి మరోసారి నటించబోతున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇప్పటికే మూడు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో వచ్చిన లాస్ట్ సినిమా క్రాక్. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో క్రాక్ కి సీక్వెల్ సినిమా ఉంటుందని గతంలోనే ప్రకటించారు.
ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో కూడా గోపీచంద్ మలినేని క్రాక్ కి సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు. దీంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ చేయబోయే క్రాక్ 2 సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఉండబోతుందని సమాచారం. ఈ మాస్ కాంబో మరోసారి సినిమా చేయబోతున్నారని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబోలో సినిమా రావాలని కోరుకుంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు.
Lokesh Kanagaraj : పది సినిమాలు చేసి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా.. షాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..