Site icon HashtagU Telugu

Ravi Teja: యూట్యూబ్ రికార్డులను బద్ధలు కొట్టిన రవితేజ టైగర్ నాగేశ్వర రావు మూవీ

Tiger Nagesh

Tiger Nagesh

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే రవితేజ గత చిత్రం టైగర్ నాగేశ్వరరావు మరోసారి వార్తల్లో నిలిచింది. కొన్ని నెలల క్రితం యూట్యూబ్ లో అధికారికంగా విడుదలైన ఈ సినిమా హిందీ వెర్షన్ 100 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ లైక్స్ దాటింది. నార్త్ ఇండియన్ సినీ ప్రియుల నుంచి విశేష స్పందన రావడంతో చిత్రబృందం ఆనందంలో మునిగితేలుతోంది.

నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, సుదేవ్ నాయర్, రేణు దేశాయ్, నాజర్, అనుకృతి, హరీష్ పేరడి, జిషు సేన్ గుప్తా తదితరులు నటించిన ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై వంశీ కృష్ణ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. అయితే ఈ మూవీ బిగ్ స్క్రీన్ పై ఆశించిన మేర ఆడలేదు. కానీ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.