Ramarao on Duty: ఓటీటీలోనూ బ్యాడ్ టాక్.. నెటిజన్స్ దెబ్బకు డైరెక్టర్ ట్విట్టర్ లాక్

దర్శకుడు శరత్ మండవ సినిమా విడుదలకు ముందు ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.

Published By: HashtagU Telugu Desk
Ramarao On Duty

Ramarao On Duty

దర్శకుడు శరత్ మండవ సినిమా విడుదలకు ముందు ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ప్రేక్షకులను సినిమా చూడమని కోరాడు. ‘ట్విట్టర్ పిట్టలు వేసే రొట్టెలు’ పట్టించుకోవద్దు అంటూ కామెంట్స్ చేశాడు. జూలై చివరి వారంలో సినిమా విడుదలైన వెంటనే, శరత్ మండవ మీడియాలో లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడా కనిపించలేదు. సినిమా చూసిన తర్వాత విమర్శకులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా డబ్బా సినిమా తీసినందుకు దర్శకుడిపై విరుచుకుపడ్డారు.

ఇప్పుడు, రామారావు ఆన్ డ్యూటీ సెప్టెంబర్ 15న OTT ప్లాట్‌ఫారమ్, SonyLIVలో విడుదలైంది. అయితే శరత్ ట్రోలింగ్‌కు చాలా భయపడి ట్విట్టర్‌లో తన అక్కౌంట్ ను లాక్ చేశాడు. రవితేజ అభిమానుల భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమా థియేటర్స్ లో ఎలా అయితే ఘోర పరాజయం పాలైందో, ఓటీటీలో అంతకుమించి బ్యాడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదేం మూవీరా బాబాయ్ అంటూ ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

  Last Updated: 16 Sep 2022, 02:53 PM IST