చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. మొన్న కోటశ్రీనివాస్ రావు , నిన్న సరోజాదేవి , ఈరోజు రవితేజ తండ్రి (Raviteja Father) కన్నుమూసి చిత్రసీమను శోకసంద్రంలో పడేసారు. మంగళవారం రాత్రి రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (Rajagopal Raju)(90) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న అయన నిన్న రాత్రి రవితేజ నివాసంలో కన్నుమూసారు. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తిరీత్యా ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఆయనకు రవితేజ,రఘు, భరత్ రాజు అనే ముగ్గురు కుమారులు.
Aims report : రోడ్డు ప్రమాదాలకు కారణం నిద్రలేమి.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం సంచలన రిపోర్టు
రెండు రోజుల క్రితమే కోట శ్రీనివాసరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. రవితేజ, కోట శ్రీనివాసరావు తండ్రి కొడుకులుగా ఇడియట్ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ సినిమాలో వారి మధ్య బాండింగ్ రియల్ ఫాదర్ అండ్ సన్ లాగా ఉంటుంది. కోట మరణంతో రవితేజ చాలా ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా కోటకు సంతాపం తేలుపుతు ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు రవితేజ. ఇదిలా ఉండగానే ఈరోజు రియల్ ఫాదర్ భూపతి రాజు రాజగోపాల్ శాశ్వతంగా దూరమవడంతో రవితేజ శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ కష్ట సమయంలో మీ వెంట మేము ఉన్నామని ధైర్యంగా ఉండాలని రవితేజకు మద్దతుగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు కామెంట్స్ చేస్తూ , సంతాపం తెలియపరుస్తున్నారు. ప్రస్తుతం రవితేజ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు.