Site icon HashtagU Telugu

Ravi Teja’s Dhamaka: రవితేజ మాస్ ‘ధమాకా’ మొదలైంది!

Dhamaka1

Dhamaka1

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ధమాకా” విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ కూడా చివరి దశలో ఉంది. చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ జింతాక్ లిరికల్ వీడియో ఆగస్టు 18, మధ్యాహ్నం 12:01 గంటలకు విడుదల చేయనున్నారు.

మాస్ నెంబర్ గా రాబోతున్న ఈ పాట పోస్టర్‌ లో రవితేజ సాంప్రదాయ దుస్తులలో శ్రీలీలా ను ఎత్తుకున్నట్లు కనిపించడం అలరిస్తోంది. పోస్టర్ లో వారి ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే జింతాక్ మాస్ డ్యాన్స్ నెంబర్ గా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version