Site icon HashtagU Telugu

Mokshadha : చిత్రసీమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ర‌వితేజ కుమార్తె

Raviteja Daughter

Raviteja Daughter

చిత్రసీమ (Film Industry )లో హీరోలు కొడుకులు హీరోలుగా..నిర్మాతల తనయులు హీరోలు గా , నిర్మాతలు గా , హీరోయిన్ల కుమార్తెలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే..మాస్ రాజా రవితేజ (Raviteja) కుమారుడు మహాధన్ (Mahadhan Bhupatiraju) , కూతురు మోక్ష‌ధ‌ (Mokshadha ) డైరెక్టర్లు గా రాణించాలని చూస్తున్నారు. చిత్రసీమలోకి రవితేజ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రవితేజ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేసి..ఆ తర్వాత సైడ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్నాడు..ఆలా పలు సినిమాలు చేసిన రవితేజ..పూరి డైరెక్షన్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీ చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ఇలా హ్యాట్రిక్ కొట్టి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏడాది రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ దూసుకెలుతున్నాడు.

ఇక రవితేజ కుమారుడు మహాధన్ మాత్రం డైరెక్షన్లో రాణించాలని ఫిక్స్ అయ్యాడు. మహాధన్‌ కి దర్శకత్వం పై ఉన్న ఆసక్తితో పాటు, దర్శకుడు సందీప్‌ వంగ (Sandeep Vangaa) పై విపరీతమైన అభిమానం ఉందట. అందుకే గత కొన్నాళ్లుగా సందీప్‌ వంగ వద్ద మహాధన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్ గా వర్క్‌ చేస్తున్నాడు. స్క్రిప్ట్‌ వర్క్‌ తో పాటు, అన్ని విషయాలపైనా పట్టు కోసం మహాధన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. 20 ఏళ్ల మహాధన్‌ త్వరలోనే దర్శకుడిగా ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు రవితేజ కూతురు మోక్ష‌ధ‌ సైతం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరింది. మోక్ష‌ధ‌కు డైరెక్ట‌న్ డిపార్ట్ మెంట్ అంటే ఆస‌క్తి ఉంది. ద‌ర్శకత్వంలో మెళ‌కువ‌లు నేర్చుకొనే ప‌నిలో త‌ను బిజీగా ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించే ఓ సినిమా కోసం త‌ను స‌హాయ ద‌ర్శ‌కురాలిగా ప‌ని చేస్తోంద‌ని టాక్‌. మొత్తం మీద తాను డైరెక్టర్ అవ్వాలని కాలేకపోయినా రవితేజ..తన పిల్లలను మాత్రం డైరెక్టర్లుగా చూడాలని అనుకుంటున్నారు.

Read Also : Intelligence : మీరు ఫోన్‌ని పట్టుకునే విధానం మీరు ఎంత స్మార్ట్‌గా ఉన్నారో తెలుపుతుంది..!

Exit mobile version