Site icon HashtagU Telugu

Sundaram Master OTT: రెండు ఓటీటీల్లో సుందరం మాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?

Mixcollage 06 Mar 2024 08 41 Am 7593

Mixcollage 06 Mar 2024 08 41 Am 7593

టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నాడు వైవాహర్ష. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు షార్ట్ ఫిలిమ్స్ లో వెబ్ సిరీస్లలో ఫుల్ బిజీబిజీగా తెలుపుతున్నాడు. ఇది ఇలా ఉంటే వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం సుందరం మాస్టర్. మాస్ మహరాజా రవితేజ నిర్మాతగా వ్యవహరించడం, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై బజ్ పెంచింది.

అలాగే మెగాస్టార్ చిరంజీవి, నాగచైతన్య వంటి స్టార్ హీరోలు ప్రమోషన్ లలో పాల్గొనడంతో సుందరం మాస్టర్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైన సుందరం మాస్టర్ యావరేజ్ గా నిలిచింది. ఎప్పటిలాగే వైవా హర్ష తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడని ప్రశంసలు వచ్చాయి. తక్కవ బడ్జెట్ మూవీ కావడంతో నిర్మాతలకు బాగానే లాభాలు వచ్చినట్లు సమాచారం. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన సుందరం మాస్టర్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఏకంగా రెండు ఓటీటీల్లోనూ వైవా హర్ష సినిమా అందుబాటులోకి రానుంది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ ఆహాతో పాటు ఈటీవీ విన్ లో ఈ లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 21 నుంచి లేదా మార్చి 22 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే సుందరం మాస్టర్ ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక సమాచారం వెలువడనున్నట్లు సమాచారం. ఒక కమెడియన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వైవాహర్ష నటుడిగా మాత్రమే కాకుండా ఈ సినిమాతో హీరోగా కూడా మారారు.