Site icon HashtagU Telugu

‘RT 76’ : సంక్రాంతి రేసులో రవితేజ

Rt76

Rt76

మాస్ మహారాజ రవితేజ (Raviteja) హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ‘మాస్ జాతర’ (Mass Jathara )సినిమా కోసం శ్రీలీలతో జతకట్టిన రవితేజ, ఈ మూవీని వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న విడుదల కాబోతుంది. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

Sindhura plant : ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నం: ప్రధాని మోడీ

ఇక రవితేజ తన తదుపరి సినిమాను కూడా లైన్‌లో పెట్టారు. ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల (Kishor Tirumala)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కొత్త సినిమాను గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ కొత్త అవతార్‌లో కనిపించనున్నాడు. ఈ సందర్బంగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్‌లో బిజినెస్ క్లాస్‌లో ఓ చేతిలో స్పానిష్ బుక్, మరో చేతిలో షాంపైన్ బాటిల్ పట్టుకుని కనిపించిన రవితేజ, తన స్టైల్‌కి తగ్గట్టుగా హై యాటిట్యూడ్ చూపించారు. ఇది కామెడీ, యాక్షన్, డ్రామా మిక్స్ అయిన ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని స్పష్టమవుతోంది.

Vishal : హీరో విశాల్ కు బిగ్ షాక్.. రూ.21 కోట్లు చెల్లించాలన్న మద్రాస్ హైకోర్టు

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుండగా, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకూ సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’లో కలిసి పనిచేసిన రవితేజ–సుధాకర్ చెరుకూరి కాంబో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.