Ravi Teja: మరోసారి రవితేజ నట విశ్వరూపం.. ఈగల్ టీజర్ తో గూస్ బమ్స్!

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలు చేస్తూ దూకుడు పెంచుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Is Raviteja Eagle Quit From Pongal Race

Is Raviteja Eagle Quit From Pongal Race

Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలు చేస్తూ దూకుడు పెంచుతున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన ప్రధాన పాత్రలో నటించిన టైగర్ నాగేశ్వరరావు విడుదలై మంచి వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. తాజాగా (Ravi Teja) హీరోగా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా ‘ఈగల్‌’ (Eagle)లో మూవీలో నటిస్తున్నాడు.

కొద్ది సేపటి క్రితమే నిర్మాతల టీజర్‌ను చిత్రబృందం విడుదల చేశారు. యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ కొత్త గెటప్‌లో కనిపించనున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్‌లో డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, మధుబాల, కావ్య థాపర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సంక్రాంతి బరిలో మరిన్ని సినిమాలు విడుదలకు సిద్ధం ఉండటంతో రవితేజ ఈగల్ రిలీజ్ అవుతుందా, లేదా అని వేచి చూడాల్సిందే.

  Last Updated: 06 Nov 2023, 01:36 PM IST