Site icon HashtagU Telugu

Eagle Ott: ఓటీటీలోకి రవితేజ ఈగల్ మూవీ ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mixcollage 24 Feb 2024 09 17 Am 7183

Mixcollage 24 Feb 2024 09 17 Am 7183

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం ఈగల్. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలై మంచి సక్సెస్ ను అందుకుంది. ఒక మాస్ స్టైలిష్ యాక్షన్ సినిమాతో థియేటర్స్ లో అదరగొడుతున్నారు రవితేజ. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే థియేటర్లలో చూసినవారు ఓటీటీలో మరోసారి చూడడానికి కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌ ఈగల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర టీమ్ తో, ఈటీవీ విన్‌ కూడా పోస్టర్‌ను విడుదల చేశాయి. ఎప్పటినుంచి మూవీ ఓటిటిలోకి అందుబాటులోకి వస్తుందన్న విషయం మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికీ థియేటర్‌లో నడుస్తున్న ఈ చిత్రం ఓటీటీలో రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు.

K

రిలీజ్ డేట్ నుంచి కనీసం నాలుగైదు వారాల తర్వాత ఈగల్‌ మూవీను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే మార్చి 2 వ వారం నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే హీరో మాస్ మహారాజా రవితేజ విషయానికి వస్తే రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు రవితేజ. ఈ మేరకు గత ఏడాది టైగర్ నాగేశ్వరరావు వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ ఇటీవల ఈగల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు.. ఇక ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.