Site icon HashtagU Telugu

Raviteja Eagle : ఈగల్ ను ఎవరు పట్టించుకోవడం లేదా..?

Raviteja Egel

Raviteja Egel

మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటించిన ఈగల్ (Eagle) మూవీ మరో వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయినప్పటికీ ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా..సినిమాల్లో నటించాలనే తపనతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు రవితేజ. కెరియర్ మొదట్లో ఎన్నో కష్టాలుపడ్డాడు..చిన్న చిన్న అవకాశాల కోసం స్టూడియో ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాడు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా ఇలా ఎన్నో చేసాడు. నీకోసం మూవీ తో హీరో గా పరిచమయ్యాడు.

ఆ తర్వాత పూరి డైరెక్షన్లో చేసిన ఇడియట్ మూవీ రవితేజ కెరియర్ ను మార్చేసింది. ఇడియట్ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ టాప్ హీరో రేంజ్ కి వెళ్ళాడు. ఇటీవల వరుస ప్లాప్స్ రవితేజ ను ఇబ్బందిపెడుతున్నాయి. ఏడాదికి రెండు , మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నప్పటికీ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. ఈ మద్యయితే అసలు రవితేజ నుండి ఎన్ని సినిమాలు వచ్చాయో..వాటి పేర్లు కూడా గుర్తులేని పరిస్థితి..అంతే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్లు కావడం తో నిర్మాతలకు , డిస్ట్రబ్యూటర్స్ కు భారీ నష్టం వాటిల్లాయి. ఇక ఇప్పుడు ఈగల్ తో వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ.

We’re now on WhatsApp. Click to Join.

గత సినిమాల ప్రభావం ఈ సినిమా ఫై భారీగా పడుతుంది. ఈ సినిమా గురించి అసలు ఎవ్వరు మాట్లాడుకోవడం లేదు. ఓ పక్క రవితేజ తో పాటు మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అభిమానులు సైతం పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. అసలు సినిమా వస్తున్న సంగతి కూడా తెలియడం లేదు. ఇటీవల కాలంలో అంచనాల తో వచ్చిన చిత్రాలే పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. అలాంటిది ఏమాత్రం అంచనాలు లేకుండా వస్తున్న ఈగల్ ఏ రేంజ్ లో వసూళ్లు చేస్తుందో అని అంత ఖంగారు పడుతున్నారు.

ధమాకా, డిస్కో రాజా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన కార్తీక్.. దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ మూవీని డైరెక్ట్ చేసాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

Read Also : Poonam Pandey: నేను చనిపోలేదు.. పూనమ్ పాండే సంచలన వీడియో..!

Exit mobile version