Raviteja : హాస్పటల్ నుండి రవితేజ డిశ్చార్జ్

తాను ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉన్నాన‌ని, త్వ‌ర‌లోనే సెట్‌లో అడుగుపెట్టేందుకు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లుగా చెప్పారు

Published By: HashtagU Telugu Desk
Raviteja Injured

Raviteja Injured

మాస్ మహారాజా రవితేజ ప్రమాదానికి (Raviteja Injured) గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ RT75 మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే మేకర్స్ యశోద హాస్పిటల్‌ (Yashoda Hospitals)లో జాయిన్ చేశారు. చికిత్స చేసిన డాక్టర్స్ ఆయన్ను ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. నిన్నటి నుండి హాస్పటల్ లో చికిత్స తీసుకున్న రవితేజ ను శనివారం డిశ్చార్జ్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

వాస్తవానికి గురువారం షూటింగ్‌లో రవితేజ కు గాయమైంది. చిన్న గాయమే కదా? అని షూటింగ్‌ను కంటిన్యూ చేశాడట. అదే ఇప్పుడు సర్జరీ వరకు తీసుకెళ్లిందట. అలా షూటింగ్ చేయడంతో కుడి చేతికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందట. ఆయన ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడని, విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తాను డిశ్చార్జ్ అయినట్లు రవితేజ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టాడు. సాఫీగా సాగిన సర్జరీ అనంత‌రం విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యాను. తాను ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉన్నాన‌ని, త్వ‌ర‌లోనే సెట్‌లో అడుగుపెట్టేందుకు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లుగా చెప్పారు. త‌న క్షేమాన్ని ఆకాంక్షిస్తూ మెసేజ్‌లు చేసిన వారంద‌రికి ధ‌న్య‌వాదాలు అంటూ ర‌వితేజ రాసుకోచ్చాడు.

ఇదిలా ఉంటె రవితేజ రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ (Mister Bachchan) మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.హరీష్ శంకర్ డైరెక్షన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ..మొదటి ఆట తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.

Read Also : Congress Plan B : కర్ణాటక కోసం కాంగ్రెస్ ‘ప్లాన్ బి’ సిద్ధం చేసిందా..?

  Last Updated: 24 Aug 2024, 04:37 PM IST