మాస్ మహారాజ రవితేజ (Ravi Teja), యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) నటించిన ధమాకా (Dhamaka) మూవీ టాలీవుడ్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. త్రినాథరావు తెరకెక్కించిన ‘ధమాకా’ గత నెల 23న విడుదలైంది. 2022 ఇయర్ ఎండ్ లో రిలీజ్ అయినా ఈ మూవీ ఇప్పటికే థియేటర్స్ లో సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. రవితేజ ఎనర్జీ, శ్రీలీల అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా రూ.100 కోట్లు+ గ్రాస్ సాధించినట్లు చిత్రబృందం వెల్లడిస్తూ ఈ పోస్టర్‌ను విడుదల చేసింది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నిరాశపర్చిన రవితేజ ధమాకా (Dhamaka) తో తానేంటో నిరూపించుకున్నాడు. ఇక కెరీర్ లో తొలిసారి 100 కోట్ల హీరోగా రికార్డు సాధించాడు. తాజాగా ‘ధమాకా’ (Dhamaka) 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడంతో రవితేజ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదలైన ఐదు రోజుల్లో 49 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఆరు రోజు ఆ 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది.
ఇక తర్వాత 50, 85, 92 కోట్లు సాధిస్తూ 100 కోట్ల క్లబ్ లోకి చేరుకుంది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ డల్ అవుతాయి. ఆదివారం రాబట్టిన వసూళ్ళలో సోమవారం సగం వస్తేనే చాలా గొప్ప. కానీ ధమాకా మూవీ మాత్రం రోజురోజుకూ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళ్లుతోంది. అన్ని వారాల్లో సక్సెస్ పుల్ గా నడిచిన ధమాకా, మొదటి మూడు రోజుల్లో 32 కోట్లకు (Collections) పైగా కలెక్ట్ చేసిందంటే ఈ సినిమాకున్న ఆదరణ ఎలాంటిదో తెలిసిపోతోంది.
Also Read: Thalapathy Vijay: దళపతి విజయ్ భార్యకు విడాకులు ఇవ్వనున్నారా!