Site icon HashtagU Telugu

Dhamaka Pulsar Bike Song: ‘పల్సర్ బైక్’ పాటతో దుమ్మురేపిన రవితేజ- శ్రీలీల

Pulsar Bike

Pulsar Bike

మాస్ మహారాజ రవితేజ (Ravi Teja), యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) నటించిన ధమాకా (Dhamaka) మూవీ టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంటర్ టైన్ చేస్తోంది. 2022 ఇయర్ ఎండ్ లో రిలీజ్ అయినా ఈ మూవీ ఇప్పటికే థియేటర్స్ లో సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. రవితేజ ఎనర్జీ, శ్రీలీల అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ జంట ఈ మూవీలో ఓ ప్రైవేట్ సాంగ్  అయినా పల్సర్ బైక్ పాటకు స్టెప్పులు వేసి ఉర్రూతలూగించింది. థియేటర్స్ లో ఈలలు వేస్తున్న ఈ పాటను ధమాకా (Dhamaka) మేకర్స్ రిలీజ్ చేశారు. మీరు కూడా ఓ లుక్ వెయ్యండి!

‘ధమాకా’ అదిరిపోయే కలెక్షన్స్
‘ధమాకా’ (Dhamaka) మూవీ ఇప్పటికే 80 నుంచి 85  కోట్ల రూపాయల క్లబ్‌లో చేరినట్లు తెలుస్తోంది. కేవలం ఐదు రోజుల్లో 49 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరు రోజు ఆ 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా 85 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం పేర్కొంది.

త్వరలో 100 కోట్లు?

‘ధమాకా’ తొలి రోజు పది కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ డల్ అవుతాయి. ఆదివారం రాబట్టిన వసూళ్ళలో సోమవారం సగం వస్తే గొప్ప అని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. కానీ, ‘ధమాకా’ అలా కాదు… నాలుగో రోజు కూడా దుమ్ము లేపింది. మొదటి మూడు రోజుల్లో 32 కోట్లకు (Collections) పైగా కలెక్ట్ చేసిన ‘ధమాకా’ నాలుగో రోజు 42 ప్లస్ కోర్స్ కలెక్ట్ చేసింది. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ మూవీ వంద కోట్ల మార్క్ కు చేరుకోగలదు.

Also Read : Jr NTR and Janhvi: క్రేజీ కాంబినేషన్.. ఎన్టీఆర్ తో రొమాన్స్ కు జాన్వీ రెడీ!

Exit mobile version