Kangana Ranaut: కంగనా రనౌత్ చేతుల మీదుగా రావణ దహనం, తొలి మహిళ సెలబ్రిటీగా రికార్డు!

50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయనుంది.

  • Written By:
  • Publish Date - October 24, 2023 / 01:53 PM IST

Kangana Ranaut: ఢిల్లీలోని ఎర్రకోటలో లవ్ కుష్ రామ్‌లీలా సమితి తరపున రావణ్ దహన్ పండుగను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు. ఈ పండుగలో తొలిసారిగా రావణుడి దిష్టిబొమ్మను ఓ మహిళ చేయబోతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ఈ తొలి చారిత్రక గౌరవం దక్కనుంది. ఢిల్లీ లవ్ కుష్ రాంలీలా సమితి అధ్యక్షుడు అర్జున్ సింగ్  ఈ వియాన్ని అధికారికంగా ధృవీకరించగా, కంగనా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె రాబోయే ప్రోగ్రామ్ గురించి చర్చించింది. రాబోయే చిత్రం ‘తేజస్’ గురించి మాట్లాడింది. ఇక ‘ఈ సంవత్సరం ఎర్రకోటలో లవ్ కుష్ రాంలీలా సమితి 50వ వార్షిక వేడుకలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఒక మహిళ దిష్టిబొమ్మను దహనం చేయబోతుంది.

సెప్టెంబరులో పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది అని లవ్ కుష్ రామ్‌లీలా కమిటీ చైర్మన్ అర్జున్ సింగ్ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా మా ఉత్సవాల్లో వీఐపీలు ఉండేవారని, కొంతమంది కళాకారులు, రాజకీయ నాయకులు మా కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సినీ నటులు అజయ్‌ దేవగన్‌, జాన్‌ అబ్రహం తదితరులు పాల్గొన్నారు. నటుడు ప్రభాస్ గతేడాది రావణ దహనం చేశాడు. మా 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయనుంది.

కంగనా ప్రస్తుతం తేజస్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. సర్వేష్ మేవారా రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషిస్తుంది. ఒక మహిళా సెలబ్రిటీ రావణ దహన్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి కాబట్టి, ఆమె నెటిజన్ల నుండి ప్రశంసలను కూడా పొందింది.