Site icon HashtagU Telugu

Rajinikanth – Vishal : విశాల్ రజినీకాంత్ కి కౌంటర్ ఇచ్చాడా.. వైరల్ అవుతున్న పొలిటికల్ కామెంట్స్..

Rathnam Star Vishal Satire Comments On Rajinikanth Political Entry

Rathnam Star Vishal Satire Comments On Rajinikanth Political Entry

Rajinikanth – Vishal : తెలుగుతో పోలిస్తే తమిళనాడుకి చెందిన సినిమా స్టార్స్ అక్కడి రాజకీయాల్లో ఎక్కువుగా కనిపిస్తుంటారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క పొలిటికల్ విమర్శలు చేస్తూ వస్తుంటారు. కాగా రానున్న రెండేళ్ల తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్, విజయ్, విశాల్.. ఇలా స్టార్ హీరోలతో పాటు మరికొంతమంది సినిమా స్టార్స్ కూడా పోటీలో కనిపించబోతున్నారు.

ఇక ఈ పొలిటికల్ ఎంట్రీ గురించే విశాల్ ని ప్రశ్నించగా.. ఆయన కొన్ని కామెంట్స్ చేసారు. ఆ కామెంట్స్ రజినీకాంత్ కి కౌంటర్ ఇచ్చినట్లు ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటే.. విశాల్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో చర్చ జరుగుతుంది. ఈ విషయం గురించే ప్రస్తుతం ‘రత్నం’ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న విశాల్ ని ప్రశ్నించారు. “మీరు నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా..?” అంటూ విశాల్ ని క్వశ్చన్ చేసారు.

దీనికి విశాల్ బదులిస్తూ.. “టైం వచ్చినప్పుడు వస్తాను లేదు దేవుడు చెప్పినప్పుడు వస్తాను అని చెప్పకుండా, క్లియర్ అండ్ స్ట్రెయిట్ గా చెబుతున్నా వినండి. నేను రాజకీయాల్లోకి తప్పకుండా వస్తాను. ఇది పక్కా” అంటూ బల్లగుద్ది చెప్పేసారు. దీంతో విశాల్ పొలిటికల్ ఎంట్రీ త్వరలోనే ఉండబోతుందని అర్ధమవుతుంది. ఇది ఇలా ఉంటే, విశాల్ చేసిన ఈ కామెంట్స్ రజినీకాంత్ కి కౌంటర్ ఇచ్చినట్లు ఉన్నాయి.

గతంలో రజినీకాంత్ కూడా పాలిటిక్స్ లోకి వస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో ఆయన.. టైం వచ్చినప్పుడు వస్తాను, దేవుడు చెప్పినప్పుడు వస్తాను అంటూ చెప్పుకొచ్చి, చివరికి ఆరోగ్యం సహకరించడం లేదని పాలిటిక్స్ నో చెప్పారు. ఇప్పుడు విశాల్ చేసిన ఈ కామెంట్స్, రజిని కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చేలాగానే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Venkatesh : వెంకీ మామ సినిమాలో నటించాలని అనుకుంటున్నారా.. అయితే ఈ అవకాశం..