BiggBoss7: రతిక రోజ్ కు యూత్ లో క్రేజ్.. బిగ్ బాస్ లో అందరి కళ్లు ఈ బ్యూటీపైనే!

బిగ్ బాస్ లో ఓ బ్యూటీ తన చేష్టలు, మాటలతో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Published By: HashtagU Telugu Desk
Rathika Rose

Rathika Rose

BiggBoss7 తెలుగు రియాలిటీ షోలో ప్రవేశించిన చాలా మంది కంటెస్టెంట్లకు ప్రేక్షకులలో అంతగా ఆదరణ పొందలేదు. అయితే మొదటి వారంలో ఓ బ్యూటీ తన చేష్టలు, మాటలతో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆమె మరెవరో కాదు హైదరాబాద్‌కు చెందిన రతికా రోజ్.

#BiggBoss7 హౌస్‌లోకి రాకముందు రతిక రోజ్ గురించి చాలా మందికి తెలియదు. కానీ వాస్తవానికి, షకలక శంకర్‌తో కలిసి 2020 చిత్రం “బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది”తో టాలీవుడ్‌లో ప్రధాన నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ సమయంలో ఆమె ప్రియ అనే పేరుతో పిలవబడింది. అంతేకాదు.. స్టాండప్ కామెడీలో కి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ETV స్టాండప్ కామెడీ షో పటాస్‌లో కూడా కనిపించింది. ఈమె రీసెంట్‌గా ‘నేను స్టూడెంట్‌ సర్‌’ సినిమాలో కూడా కనిపించింది. అయితే ఈ ఈ సినిమాలన్నీ హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీ వెలుగులోకి రాలేదు.

బిగ్ బాస్‌కి వస్తున్నప్పుడు, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్‌తో రతిక క్లోజ్‌నెస్ ట్రాక్, హావాభావాలు ఆకట్టుకున్నాయి. కొన్ని సోషల్ మీడియా పోల్స్‌లో ఓట్ల పరంగా కూడా ముందంజలో ఉంది. అయితే మునుపటి సీజన్లలో చాలా మంది అమ్మాయిలు తమ గ్లామర్ లుక్స్ ద్వారా ఫేమ్ అయ్యారు. అయితే కుర్రకారును అలరించినా చివరకు టైటిల్ గెలువలేకపోయారు. మరి ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి మరి.

Also Read: Salaar Movie: సలార్ కు గ్రాఫిక్స్ దెబ్బ.. రిలీజ్ పై నో క్లారిటీ!

  Last Updated: 08 Sep 2023, 06:05 PM IST