Bigg Boss-7: వరుసగా మహిళలు ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి

బిగ్ బాస్ సీజన్-7 నాలుగో వారం నామినేషన్లు హాట్ హాట్ గా సాగుతున్నాయి. 14 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఏడో సీజన్‌లో ఇప్పటి వరకు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు

Bigg Boss-7: బిగ్ బాస్ సీజన్-7 నాలుగో వారం నామినేషన్లు హాట్ హాట్ గా సాగుతున్నాయి. 14 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఏడో సీజన్‌లో ఇప్పటి వరకు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 11 మంది పోటీదారులు హౌస్‌లో ఉన్నారు. శివాజీ, సందీప్ మాస్టర్, శోభ మరియు పల్లవి ప్రశాంత్ హౌస్‌మేట్స్ మరియు నామినేషన్లకు దూరంగా ఉన్నారు. మిగిలిన ఏడుగురు శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, రతిక రోజ్, ప్రియాంక జైన్ మరియు అమర్‌దీప్ చౌదరి. ఓటింగ్ పోల్స్ ప్రకారం రతికకు తక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో టైటిల్ ఫేవరెట్ గా వచ్చిన రతిక నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది.

రతిక హౌస్ లో అడుగుపెట్టిన నాటి నుండి గేమ్‌లు, టాస్క్‌లు కూడా గట్రా బాగా ఆడుతుంది. ఈ సమయంలో రాహుల్ సిప్లిగంజ్ తో దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మరింత క్రేజ్ పెరిగింది. అంతే కాకుండా ఇంట్లో లవ్ ట్రాక్స్ నడపడం కూడా ఆమెపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. పల్లవి ప్రశాంత్‌ను వెన్నుపోటు, యావర్‌ని పోటీదారుగా, హౌస్‌మేట్‌గా చూడమని చెప్పడం, కన్ఫెషన్ రూమ్‌లో అతనికి వ్యతిరేకంగా మాట్లాడటం వంటి పలు కారణాల వల్ల రతిక ఎలిమినేట్ అయింది.

కిరణ్ రాథోడ్, షకీలా, దామిని భట్ల, ఇప్పుడు రాతిక నలుగురు మహిళలు వరుసగా ఎలిమినేట్ కావడం తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం బిగ్ బాస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ హౌస్‌మేట్ అనర్హుడని.. శివాజీ తన అధికార అస్త్రాన్ని కోల్పోయాడని అరుగురు కంటెస్టెంట్లు చెప్పారు. ఇక నుంచి శివాజీ కంటెస్టెంట్‌గా కొనసాగనున్నారు. పల్లవి ప్రశాంత్, సందీప్ మాస్టర్ మరియు శోభా శెట్టి మాత్రమే హౌస్‌మేట్స్.

Also Read: World Vegetarian Day : ఆరోగ్యం, రుచికి కేరాఫ్ శాకాహారం.. వెజిటేరియన్ డే నేడే