Rashmika Mandanna: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” లో నటిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాగా దర్శకుడు పరశురామ్. ఈ సినిమా 15 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి ఫ్యామిలీ స్టార్ టీం USA కి వెళ్లింది. ఈ తరుణంలో ‘యానిమల్’ ఫేమ్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నటిస్తున్నట్లు సమాచారం.
నిజానికి పరశురామ్ సినిమాకి కూడా రష్మిక మందన్న ఎంపికైంది. కానీ తెలియని కారణాల వల్ల ఆమె ఇతర ప్రాజెక్టులకు సంతకం చేసింది. దీంతో ఈ మూవీకి డేట్స్ సర్దుబాటు కాలేదు. అయితే ఇటీవల విజయ్, మృణాల్, రష్మికలపై చిత్రీకరించిన “ఫ్యామిలీ స్టార్” ప్రత్యేక పాటలో రష్మిక కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, రష్మిక కేవలం ఒక పాటలో కనిపిస్తుందా లేదా ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందో తెలియాల్సి ఉంది. అయితే విజయ్-రష్మిక పరశురామ్ డైరెక్షన్ లో ‘గీత గోవిందం’తో హిట్ ఫెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మృణాల్, రష్మిక ఇద్దరూ సోదరీమణులుగా కనిపిస్తారని ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read: Nithin Interview: నా 21 ఏళ్ల సినీ కెరీర్‌లో నేను చేసిన అత్యుత్తమ పాత్రల్లో ఇదొకటి