Site icon HashtagU Telugu

Rashmika Role: పుష్ప2లో రష్మిక పాత్ర తగ్గిందా.. సెట్స్ లో అడుగుపెట్టని శ్రీవల్లి!

Pushpa2

Pushpa2

పుష్ప సినిమా అనగానే చాలామందికి పుష్పరాజ్ పాత్ర గుర్తుకువస్తుంది. ఆ క్యారెక్టర్ తర్వాత అందర్నీ ఆకట్టుకున్న మరో క్యారెక్టర్ శ్రీవల్లీ (Srivalli). ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్. కానీ పుష్ప2 శ్రీవల్లి పాత్ర తగ్గిందా? అనే టాక్ టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్, రష్మిక (Rashmika Mandanna) కలిసి నటించిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా సక్సెస్ అయింది.

ఈ సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్ప-2 (Pushpa2) షూటింగ్ నడుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో అల్లు అర్జున్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ మొదలై చాన్నాళ్లయింది. కానీ ఇంతవరకు హీరోయిన్ రష్మిక సెట్స్ పైకి రాలేదు. దీంతో అందర్లో అనుమానాలు మొదలయ్యాయి.

పుష్పలో హీరోయిన్ (Rashmika Mandanna) గా రష్మిక నటించింది కాబట్టి, పార్ట్-2లో ఆమెను తీసేయలేరు. కాబట్టి రష్మికకు ఆ టెన్షన్ లేదు. అయితే పార్ట్-2లో ఆమె భాగాన్ని బాగా కుదించారనే టాక్ మాత్రం ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. అందుకే ఆమె సెట్స్ పైకి కాస్త లేటుగా రాబోతోందనేది తాజా సమాచారం. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో మెరిసింది రష్మిక. పార్ట్-1లో ఆమె పాత్రకు చాలా వెయిట్ ఇచ్చారు. అయితే పుష్ప పాన్ ఇండియా లెవెల్లో హిట్టవ్వడంతో, పార్ట్-2లో హీరోకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, హీరోయిన్ పాత్రను (Rashmika Mandanna) తగ్గించారనే టాక్ వినిపిస్తోంది.

Exit mobile version