Rashmika Mandanna: రష్మిక మందన్నా మార్ఫింగ్ , నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

Published By: HashtagU Telugu Desk
Rashmika

Rashmika

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ బ్యూటీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ తో డేటింగ్, బీచ్ వెకేషన్స్, పార్టీలకు సంబంధించిన ఏదైనా సోషల్ మీడియాలో వెంటనే ప్రత్యక్షమవుతుంటుంది. ఈ నేపథ్యంలో రష్మిక సంబంధించిన  మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

AI సాంకేతికత ఆధారంగా నకిలీ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు కొందరు. ఏఐ టెక్నాలజీ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. తాజాగా రష్మిక వీడియోనే అందుకు ఉదాహరణ. మార్ఫింగ్ వీడియోలు సెలబ్రిటీలకు, సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ యువతి ఎద అందాలను చూపుతూ లిఫ్ట్ లోకి ఎక్కుతూ, అందాలు ఎలివేట్ చేయడం చూడొచ్చు. అయితే ఆమె ముఖం రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేయబడింది. ఆమె అభిమానులు చాలా మంది అది ఫేక్ అని ఎత్తి చూపారు. అందులోని అసలు మహిళ జరా పటేల్, బ్రిటిష్ ఇండియన్ అని వెల్లడించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో సహా చాలా మంది ఇలాంటి తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను సృష్టించి, ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. మరి ఈ వీడియోపై రష్మిక ఏవిధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

  Last Updated: 06 Nov 2023, 12:25 PM IST