నేషనల్ క్రష్ గా పేరుగాంచిన రష్మిక మందన్న (Rashmika ) తన సినీ కెరీర్ లో అద్భుతమైన విజయాలు సాధిస్తూ, విపరీతమైన ఆస్తులను (Rashmika Assets) వెనకేసుకుంటుంది. తాజాగా ప్రముఖ ఆర్థిక పత్రిక ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం రష్మిక ఆస్తుల మొత్తం విలువ రూ.70 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. ఈమె సంపాదన త్వరలోనే రూ.100 కోట్ల మార్క్ ను చేరుకుంటుందని అంచనా వేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వరుసగా హిట్ సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తన అభిమానులను పెంచుకుంటున్న రష్మిక, ఇటు ఆస్తులను కూడా భారీగా పెంచుకుంటుంది.
LIC Health Insurance: ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ.. ఆ కంపెనీలో వాటా కొనుగోలు ?
రష్మిక ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఇది దక్షిణాదిలో అత్యధికంగా తీసుకునే హీరోయిన్ గా ఆమెను నిలబెట్టింది. సినిమాలతో పాటు పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, కూర్గ్, ముంబై, గోవా వంటి ప్రముఖ నగరాల్లో లగ్జరీ హౌస్ లను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తను మాత్రమే కాకుండా, తన కుటుంబ సభ్యుల భద్రత, హాయిగా జీవించేందుకు ఈ ఆస్తులను కూడబెట్టినట్లు చెబుతున్నారు.
Japanese Water Therapy: జపనీస్ వాటర్ థెరపీ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలివే!
కెరీర్ ప్రారంభంలోనే ఈ స్థాయికి ఎదిగిన రష్మిక.. ముందుముందు మరింతగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు పాన్-ఇండియా స్థాయిలో భారీ అవకాశాలు వస్తుండటంతో పాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రణబీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేస్తూ, ఆమె క్రేజ్ ను మరింత పెంచుకుంటోంది.