Rashmika vs Janhvi Kapoor: తెలుగులో జాన్వీ దూకుడు…రష్మికతో పోటీ

శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ను తెలుగు తెరకు పరిచయం చేయాలని ఎప్పటి నుంచో ఫిల్మ్ మేకర్స్ ట్రై చేశారు కానీ.. కుదరలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందనే విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Rashmika vs Janhvi Kapoor

Rashmika vs Janhvi Kapoor

Rashmika vs Janhvi Kapoor: బాలీవుడ్ హాట్ భామ  జాన్వీ కపూర్ ను తెలుగు తెరకు పరిచయం చేయాలని ఎప్పటి నుంచో ఫిల్మ్ మేకర్స్ ట్రై చేశారు కానీ.. కుదరలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందనే విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్టర్. ఇందులో జాన్వీ కపూర్ ఓ పల్లెటూరు అమ్మాయిగా నటిస్తోంది. జాన్వీ కపూర్ పస్ట్ లుక్ రిలీజ్ చేయడం.. ఆ లుక్ విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. అయితే.. దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన వాయిదా పడింది. అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే.. దేవర సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే జాన్వీ కపూర్ కి మాంచి క్రేజ్ ఏర్పడింది. నెక్ట్స్ మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసేందుకు ఓకే చెప్పింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్‌ నటించే సినిమాలో జాన్వీని ఫైనల్ చేశారు. మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. బోనీ కపూర్ ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో ఉన్న చరణ్‌ త్వరలో ఈ మూవీ షూట్ లో జాయిన్ కానున్నారు. మార్చి లేదా ఏప్రిలో లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే.. తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ఇప్పుడు తమిళ్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

తమిళ్ లో సూర్యకు జంటగా నటించేందుకు ఓకే చెప్పిందని తెలిసింది. ఇప్పుడు సౌతిండియాలో రష్మిక టాప్ హీరోయిన్ గా దూసుకెళుతుంది. మృణాల్ ఠాగూర్ కూడా వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. అయితే.. జాన్వీ తెలుగులో ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే భారీగా క్రేజ్, భారీగా ఆఫర్స్ సొంతం చేసుకుంటుంది. ఈ అమ్మడు సౌతిండియాలో నెక్ట్స్ సూపర్ స్టార్ అని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో అంతగా క్రేజ్ సొంతం చేసుకోకపోయినా.. సౌతిండియాలో మాత్రం క్రేజ్ దక్కించుకోవడం విశేషం. మరి.. బాలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్ అవుతాదేమో చూడాలి.

Also Read: IND vs ENG: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ మొదటికే

  Last Updated: 21 Feb 2024, 08:13 AM IST