Rashmika : ఫ్లైట్ ప్రమాదం నుండి బయటపడ్డ రష్మిక..

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 11:29 PM IST

రీసెంట్ గా ఫోర్బ్స్ జాబితా (Forbes List)లో స్థానం సంపాదించుకున్న రష్మిక (Rashmika )..ఈరోజు పెనుప్రమాదం నుండి బయటపడింది. ఈమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం (Technical issues in flight) తలెత్తడం తో టేకాఫ్ అయినా కాసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) కావడం తో ఆమె ఊపిరిపీల్చుకుంది. ఈ విషయాన్నీ స్వయంగా తన సోషల్ మీడియా పేజీలో రాసుకొచ్చింది.

సినీ స్టార్స్ ఎక్కువగా షూటింగ్ ల కోసం ఫ్లైట్ జర్నీ లు చేస్తుంటారు..దేశంలోని ప్రధాన నగరాలతో పాటు ఇతర దేశాల్లోకి వెళ్లేందుకు ఫ్లైట్ ప్రయాణం చేస్తారు. అయితే ఒక్కోసారి వీరు ప్రయాణిస్తున్న ఫ్లైట్ లలో సాంకేతిక లోపాలు తలెత్తుతుంటాయి. వీటి వల్ల ప్రాణాలు విడిచిన సినీ స్టార్స్ కూడా ఉన్నారు. మరికొంతమంది మాత్రం క్షేమంగా బయటపడ్డ వారు కూడా ఉన్నారు. ఈరోజు రష్మిక కు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది.

రష్మిక, మరో నటి శ్రద్ధాదాస్‌ ప్రయాణిస్తున్న Airvistara UK531 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఏంజరుగుతుందో కూడా వారికీ అర్ధం కాలే. ఒక్కసారిగా వారంతా భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ముంబై నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో 30 నిమిషాల తర్వాత మళ్లీ ముంబైకి విమానం చేరుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడం తో అంత ఊపిరి పిలిచుకున్నారు. ఈ ఘటనను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసి అభిమానులు , తోటి నటీనటులు కాస్త ఖంగారుకు గురై..పెద్ద ప్రమాదం తప్పిందని కామెంట్స్ పెడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె తాజాగా 30 ఏళ్ల లోపు వ్యక్తులతో ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ (Forbes India 30 Under 30 Class of 2024) జాబితాను రూపొందించింది. ఇందులో రష్మిక టాప్ ప్లేస్లో నిలిచి ఆశ్చర్య పరిచింది. ఈ విషయాన్ని స్వయంగా అభిమానులతో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. దీంతో సినీ ప్రముఖులతో పాటి అభిమానులు ఆమెకు విషెష్ అంజేశారు. ప్రస్తుతం రష్మిక ఇ పుష్ప2 : ది రూల్ లో నటిస్తుంది. ఈ మూవీ ఆగస్టు 15 న విడుదల కానుంది. VD12 – విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటిస్తుంది. D51 – ధనుష్ & శేఖర్ కమ్ముల సినిమాలో , రవితేజ- గోపీచంద్ మలినేని సినిమా లో, రెయిన్‌బో – లేడీ ఓరియెంటెడ్ మూవీలో , ఇక లేటెస్ట్‌గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీ గా ఉంది.

Read Also : Operation Chevella : సీఎం రేవంత్ రెడ్డి “ఆపరేషన్ చేవెళ్ల” స్టార్ట్ చేశాడా..?