Rashmika Mandanna నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎక్కడ ప్రత్యక్షమైనా అక్కడ తన మెరుపులు కనిపిస్తాయి. ఆన్ స్క్రీన్ పై అందాలతో అదరగొడుతూ అభినయంతో మెప్పిస్తూ వస్తున్న రష్మిక అప్పుడప్పుడు బుల్లితెర మీద కూడా సందడి చేస్తుంది. లేటెస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3 కి రష్మిక గెస్ట్ గా వచ్చింది. నేషనల్ క్రస్ రష్మిక షోకి వస్తే ఎలా ఉంటుంది.. ఒక రేంజ్ లో ఆమెకు స్వాగతం పలికారు.
ఈమధ్యనే విజయ్ దేవరకొండ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 (Telugu Indian Idol Season 3) కి వచ్చాడు. ఇప్పుడు రష్మిక కూడా వచ్చి అలరిస్తుంది. ఇక ఈ షోకి రష్మిక వేసుకొచ్చిన డ్రెస్, అమ్మడి లుక్స్ అన్ని అదిరిపోయాయి. ఈమధ్య కాలంలో బుల్లితెర మీద ఎక్కడ కనిపించని రష్మిక ఇండియన్ ఐడల్ కోసం వచ్చి ఆకట్టుకుంది. ఎప్పటిలానే తన చార్మింగ్ తో షోకి స్పెషల్ క్రేజ్ తెచ్చింది.
ఆగష్టు 15, 16 తేదీల్లో రష్మిక ఎపిసోడ్ వస్తుందని తెలుస్తుంది. ఇక రష్మిక చేస్తున్న సినిమాల గురించి చెప్పుకుంటే త్వరలో పుష్ప 2 (Pushpa 2) తో రాబోతున్న అమ్మడు ధనుష్ కుబేర సినిమాలో కూడా నటించింది. ది గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సోలో సినిమా కూడా చేస్తుంది రష్మిక.
వీటితో పాటు మరో రెండు బాలీవుడ్ ఆఫర్లు కూడా అందుకుందని లేటెస్ట్ టాక్. యానిమల్ హిట్ తర్వాత రష్మిక పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఐతే తనకు ఈ రేంజ్ పాపులారిటీకి కారణమైన తెలుగు పరిశ్రమ నుంచి ఎలాంటి ఛాన్స్ వచ్చినా కాదనకుండా చేస్తుంది రష్మిక. రష్మిక విజయ్ తో నటించే సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ సినిమా ముహుర్తం బయట పడట్లేదు. విజయ్ రష్మిక కలిసి నటిస్తే చూడాలని ఇద్దరి ఫ్యాన్స్ ఆస్కతిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Prabhas Raja Saab : రాజా సాబ్ తో పోటీనా కష్టమే కదా..?