Site icon HashtagU Telugu

Rashmika Mandanna : ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక.. ఇదే కాలేజ్ డేస్ లో జరిగుంటే..!

Rashmika Responded About Her Fake Video

Rashmika Responded About Her Fake Video

Rashmika Mandanna సినీ తారల జీవితాలు ఎంత రిచ్ గా ఉంటాయో అంతే భయంకరంగా ఉంటాయి. ముఖ్యంగా కథానాయికల పరిస్థితి అయితే మరీ దారుణం. సోషల్ మీడియా వచ్చాక తమకు నచ్చిన సెలబ్రిటీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే అవకాశం వచ్చింది. ఇక టెక్నికల్ గా అడ్వాన్స్ అవుతున్న ప్రతిసారి దాన్ని మిస్ యూజ్ చేసి సినీ తారలను ఇబ్బంది పెట్టడం చూస్తూనే ఉన్నాం. తాజాగా నేషనల్ క్రష్ స్టార్ హీరోయిన్ రష్మిక మార్పింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియలో వైరల్ అయ్యింది.

We’re now on WhatsApp : Click to Join

అది చూసిన వారు ఎవరైనా అది మార్ఫింగ్ ఫేక్ వీడియో (Rashmika Fake Video) అని తెలుసుకుంటారు. రష్మిక మార్ఫింగ్ వీడియోపై బిగ్ బీ అమితాబ్ కూడా సీరియస్ గా స్పందించారు. దీన్ని లైట్ గా తీసుకోవద్దని కేసు పెట్టి దీనికి కారణమైన వారిని శిక్షించాలని కామెంట్ పెట్టారు. ఇక సోషల్ మీడియాలో అయితే రష్మిక మార్ఫింగ్ వీడియో చెక్కర్లు కొడుతుంది.

ఈ వీడియోపై ఫైనల్ గా రష్మిక కూడా స్పందించింది. ఇది చూశాక నేను చాలా హర్ట్ అయ్యానని ఇప్పుడంటే అందరికీ తాను తెలుసు ఈ సమయంలో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ అంతా తనకు సపోర్ట్ గా ఉన్నారు. ఒకవేళ ఇదే నా కాలేజ్ డేస్ లో జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుంటేనే భయమేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు రష్మిక.

Also Read : Siri Hanmanth : జబర్దస్త్ లో కొత్త యాంకర్.. బిగ్ బాస్ తర్వాత అమ్మడికి లక్కీ ఛాన్స్..!

సినీ సెలబ్రిటీస్ జీవితాలు ఎంత కలర్ ఫుల్ గా ఉంటాయో దాని వెనక కష్టం అనే చీకటి కూడా అంతే ఉంటుంది. రష్మిక మార్ఫింగ్ వీడియోపై క్రైం బ్రాంచ్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నరు. త్వరలోనే దానికి కారణమైన వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది.