Site icon HashtagU Telugu

Rashmika Mandanna : రష్మిక రెమ్యునరేషన్ నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తుంది.. బేబీ ప్రొడ్యూసర్ ఏమన్నాడు అంటే..!

Why Rashmika skip 100 Crores Movie

Why Rashmika skip 100 Crores Movie

కన్నడ భామ రష్మిక మందన్న (Rashmika Mandanna ) తెలుగు, హిందీ భాషల్లో అదరగొట్టేస్తుంది. అమ్మడు చేస్తున్న సినిమాలు ఒక రేంజ్ లో సక్సెస్ అవుతున్న సందర్భంగా రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో చేసిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అమ్మడి రేంజ్ మరింత పెరిగింది. అయితే యానిమల్ తర్వాత రష్మిక తన రెమ్యునరేషన్ పెంచిందన్న వార్తలు వచ్చాయి. రష్మిక ఇప్పుడు ప్రతి సినిమాకు 4 నుంచి 4.5 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని మీడియా లో న్యూస్ వైరల్ అయ్యింది. అయితే రష్మిక దీనిపై స్పందించింది.

మీరు అనుకున్నట్టుగా జరిగితే బాగుండు.. ఇవి చూసైనా ప్రొడ్యూసర్స్ తనకు ఆ రెమ్యునరేషన్ ఇవ్వాలని అన్నది. అయితే దీనికి రెస్పాండ్ అయిన బేబీ నిర్మాత ఎస్.కె.ఎన్ మా గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈ ఆర్టికల్ రాకముందే ఒప్పుకున్నందుకు సంతోషమని అన్నారు. సో రష్మిక రెమ్యునరేషన్ పెంచడం అనేది కేవలం మీడియా సృష్టి తప్ప అందులో నిజం లేదని తెలుస్తుంది.

యానిమల్ తో సూపర్ హిట్ అందుకున్న రష్మిక త్వరలో పుష్ప 2 తో మరోసారి రచ్చ చేయనుంది. పుష్ప 2 లో ఆమె పాత్ర చనిపోతుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో సినిమాల్లో నటిస్తున్న రష్మిక మరో రెండు ప్రాజెక్ట్ లను చర్చల దశల్లో ఉన్నట్టు తెలుస్తుంది.

రష్మిక తెలుగులో ఆఫర్లు వస్తున్నా కూడా వరుస బాలీవుడ్ అవకాశాల వల్ల అమ్మడు ఇక్కడ సినిమాలు చేయలేకపోతుంది. మరి రష్మిక ఏం చేస్తుంది అన్నది చూడాలి.

Also Read : Upasana: కూతురు,భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన.. జలసీగా ఉందంటూ?