Site icon HashtagU Telugu

Rashmika Trolled: ఫ్రైడ్ చికెన్‌ ను ప్రమోట్ చేసిన రష్మిక, నెటిజన్స్ ట్రోలింగ్స్!

Rashmika

Rashmika

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika) అటు సినిమాలో, ఇటు కమర్షియల్ యాడ్స్ (Adds) తో చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. దేశంలోని పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా రష్మిక భారతదేశంలోని ప్రముఖ బర్గర్ బ్రాండ్ కోసం చేసిన యాడ్  ఒకటి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఫ్రైడ్ చికెన్‌ (Chiken) తింటూ రెస్టారెంట్‌లోని కొన్ని మెనూ ఐటెమ్‌లను ఆస్వాదిస్తున్నట్లు నటించింది.

అయితే, రష్మిక తాను శాఖాహారిని అని గతంలో బహిరంగంగా ప్రకటించినందున చికెన్ ఐటెమ్స్ కు ప్రచారం చేయడం విరుద్ధమని పలువురు సోషల్ మీడియాలో నెటిజన్స్ (Netizens) అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రష్మిక యాడ్ న్యూస్ వైరల్ అవుతోంది. శాకాహరి అయిన రష్మిక చికెన్ ను తింటూ ఎలా ప్రమోట్ చేస్తుందో ఆమెకే తెలియాలి అని నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

రష్మిక (Rashmika) అబద్ధాలు చెబుతున్నారని,  మాటలను మార్చిందని మండిపడ్డారు. కానీ మరికొందరు అభిమానులు మాత్రం రష్మికను సమర్థించారు. ప్రజలకు వారు కోరుకున్నది తినే హక్కు ఉందని, ఆమె తన ఆహార ఎంపికల గురించి ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మరికొందరు రష్మిక పాత వీడియో, లేటెస్ట్ యాడ్ వీడియోలను ట్యాగ్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2తో పాటు నితిన్ సినిమాలో నటిస్తోంది.

Also Read: KTR: రజనీ వ్యాఖ్యలపై కేటీఆర్ కామెంట్స్.. విపక్షాలపై సెటైర్లు