Site icon HashtagU Telugu

Rashmika : ‘మైసా’ గా మారిన నేషనల్ క్రష్..!!

Mysaa

Mysaa

ఇప్పటివరకు ప్రేమకథలతో ఆకట్టుకున్న నేషనల్ క్రష్ రష్మిక (Rashmika)..ఇప్పుడు మైసా (Mysaa) గా భయపెట్టేందుకు సిద్ధమైంది. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేయడం తో ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అయ్యింది. చేతిలో కత్తి, ముఖమంతా రక్తంతో కూడిన ఇంటెన్స్ లుక్‌తో భయపెట్టే విధంగా రష్మిక కనిపించడాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. “ధైర్యం ఆమె బలం… ఆమె గర్జన వినడానికి కాదు, భయపెట్టేందుకు…” అనే ట్యాగ్‌లైన్ సినిమా పంథా ఏదీ అన్న విషయాన్ని చెప్పకనే చెబుతోంది.

CM Chandrababu : సీఎం చంద్రబాబు బిజీ పర్యటన.. మూడు జిల్లాల్లో అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు

ఈ సినిమాను హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పూలే అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి గోపా సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. గోండు తెగల నేపథ్యంలో, ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ కథపై రెండు సంవత్సరాలుగా జట్టుగా రీసర్చ్ చేశారని మేకర్స్ తెలిపారు. ఫస్ట్ లుక్ చూసినవారంతా “రష్మిక ఏ పాత్రలో కనిపించబోతుందా?” అనే ఉత్కంఠలో ఉన్నారు.

ఇక వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న రష్మిక, ఇటీవల ‘కుబేర’ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు తన సినిమాల లైనప్‌నే మార్చేశారు. ఫీమేల్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌లపై ఎక్కువగా దృష్టి పెడుతూ ‘ది గర్ల్ ఫ్రెండ్’, బాలీవుడ్ చిత్రం ‘థామా’ తర్వాత ఇప్పుడు ‘మైసా’ను ప్రకటించారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ, తన నటనలో వైవిధ్యాన్ని చూపించేందుకు రష్మిక చేస్తున్న ఈ ప్రయోగాలు ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.