Site icon HashtagU Telugu

Rashmika Mandanna: యానిమల్ నుంచి రష్మిక లుక్ రిలీజ్, గీతాంజలిగా నేషనల్ క్రష్ ఇంట్రడ్యూస్!

Animla

Animla

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక పుష్ప మూవీతో బాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ బ్యూటీ ప్రస్తుతం ‘యానిమల్’  సినిమాలో నటిస్తోంది. అయితే మూవీ నుంచి రణబీర్ కపూర్, అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ తర్వాత మేకర్స్ అభిమానులకు కొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. సెప్టెంబర్ 23న హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. గీతాంజలి పాత్రలో నటి కనిపించనుంది. రష్మిక మందన్న రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘యానిమల్‌’లో స్క్రీన్‌ను పంచుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఈ చిత్రానికి కబీర్ సింగ్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. బల్బీర్ సింగ్‌గా అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మేకర్స్ అభిమానులను ఆశ్చర్యపరిచిన తరువాత, వారు రష్మిక పోస్టర్‌ను పంచుకున్నారు. రష్మిక లుక్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చింది.

సెప్టెంబర్ 23 శనివారం సందీప్ రెడ్డి వంగా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ‘యానిమల్’ నుండి రష్మిక ఫస్ట్ లుక్‌ని పంచుకున్నాడు. ఈ చిత్రంలో నటిని ‘గీతాంజలి’గా పరిచయం చేశాడు. కొత్త పోస్టర్‌లో, రష్మిక ఎరుపు, తెలుపు రంగుల చీరను ధరించింది. కొద్దిపాటి మేకప్ మరియు గజిబిజి జుట్టుతో ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డితో హిట్ కొట్టిన సందీప్ రెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: Modi Tour: తెలంగాణలో మోడీ బహిరంగ సభ, ఎన్నికల ప్రచార పర్వానికి బీజేపీ శ్రీకారం

Exit mobile version