Site icon HashtagU Telugu

Rashmika Mandanna Birthday Special : రష్మిక మందన్న పుట్టినరోజు నేడు, ఆమె కెరీర్‎లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ ఇవే.

Rashmika

Rashmika

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna Birthday) కన్నడ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగు సినిమాలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయం, అద్భుతమైన నటనతో కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషలలో బ్యాక్-టు-బ్యాక్ సూపర్ హిట్‌లను అందించింది. తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది.

కన్నడలో పుట్టి పెరిగిన రష్మిక కిరిక్ పార్టీతో అరంగేట్రం చేసింది. అంజనీ పుత్ర, చమక్ అనే రెండు కన్నడ చిత్రాలలో కనిపించింది. కన్నడలో 3 చిత్రాల్లో నటించిన రష్మిక మందన్న, ఆమె కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు, తెలుగు పరిశ్రమ వైపు అడుగు వేసింది. వెంకీ కుడుముల చిత్రం ఛలోలో నాగ శౌర్య సరసన ఆమె అరంగేట్రం చేసింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో సూపర్ హిట్స్ ఆమె ఖాతాలో చేరాయి. కోలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ తమిళంలో కార్తీ హీరోగా సుల్తాన్ సినిమాలో తమిళంలో కూడా నటించింది. ఆ తర్వాత ఇటీవలే విడుదలైన వరిసు చిత్రంలో తలపతి విజయ్‌తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

2022లో గుడ్‌బై, మిషన్ మంజుతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో హిందీ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది. తన తొలి చిత్రంతోనే అమితాబ్ బచ్చన్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి అగ్ర నటులతో నటించింది. రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా, ఆమెకు గుర్తింపు తెచ్చిన టాప్ పెర్ఫార్మెన్స్‌లను ఓసారి చూద్దాం.

కిరిక్ పార్టీ:
రష్మిక మందన్న తన తొలి నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమా కిరిక్ పార్టీ 2018లోసూపర్ హిట్ అందుకుంది. రష్మిక మందన్నకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కాంతారావు ఫేమ్ రిషబ్ శెట్టి ఈ సినిమాకు డైరెక్టర్ .

గీతగోవిందం:
పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం రష్మిక మందన్న కెరీర్‌కు గేమ్ ఛేంజర్‌గా మారింది. విజయ్ దేవరకొండ సరసన గీత పాత్ర నటన కీర్తిని పెంచింది. విజయ్‌తో రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గీత గోవిందం కూడా 2018లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

డియర్ కామ్రేడ్:
డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. ఇది క్లాసిక్ లవ్ డ్రామా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకోగలిగింది. విజయ్ దేవరకొండతో ఆమె కెమిస్ట్రీ కెరీర్ లో పీక్ స్టేజీ వరకు వెళ్లింది.

సరిలేరు నీకెవ్వరు:
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరులో రష్మిక నటించింది. ‘మైండ్ బ్లాక్’ , ‘అతను చాలా క్యూట్’ పాటలలో ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది. మహేష్ బాబు, రష్మిక మందన్న కామిక్ టైమింగ్ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలిచింది.

పుష్ప: ది రైజ్:
శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా నిలిచింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో తన కెమిస్ట్రీని మరచిపోకుండా, శ్రీవళి పాత్రలో ఆమె నిష్కళంకమైన నటనకు రష్మిక ప్రశంసలు అందుకుంది. తన నటనతో పాటు, అల్లు అర్జున్‌తో బ్లాక్ బస్టర్ సాంగ్ సామీ సామిలో రష్మిక చేసిన డ్యాన్స్ టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది.

రాబోయే సినిమాలు:
పుష్ప: ది రూల్ సీక్వెల్‌లో రష్మిక మందన్న నటిస్తోంది. నితిన్ తో భిష్మ తర్వాత మరో సినిమా చేస్తోంది. ఈ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ అని కాకుండా అన్ని ఇండస్ట్రీలలో మంచి పేరు సంపాదించుకున్న రష్మిక మందన్న భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తూ అభిమానుల గుండెల్లో నిలిచిపోవాలని కోరకుంటూ రష్మిక మందన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు!