Rashmika Mandanna : అమితాబ్ షోలో అభిమానికి రష్మిక వీడియో కాల్.. ప్రేమిస్తున్నాను అంటూ అభిమాని ప్రపోజల్..

తాజాగా అమితాబ్(Amitabh Bachchan) యాంకరింగ్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోర్‌పతి' ప్రోగ్రాంలో ఓ అభిమాని కోసం వీడియో కాల్ లోకి వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Rashmika Mandanna Video Call in Amitabh Bachchan Kaun Banega Crorepati Show

Rashmika Mandanna Video Call in Amitabh Bachchan Kaun Banega Crorepati Show

రష్మిక మందన్న(Rashmika Mandanna )ప్రస్తుతం సౌత్, బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే యానిమల్ సినిమాతో వచ్చి బాలీవుడ్(Bollywood) లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆల్రెడీ నేషనల్ క్రష్ గా ఉన్న రష్మిక యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. తాజాగా అమితాబ్(Amitabh Bachchan) యాంకరింగ్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోర్‌పతి’ ప్రోగ్రాంలో ఓ అభిమాని కోసం వీడియో కాల్ లోకి వచ్చింది.

హిందీలో అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోర్‌పతి(Kaun Banega Crorepati) 15వ సీజన్ గ్రాండ్ గా సాగుతుంది. తాజాగా ఈ ప్రోగ్రాంలో ప్రమోద్ భాస్కర్ అనే కంటెస్టెంట్ వచ్చాడు. ఇతను రష్మికకు పెద్ద అభిమాని కావడంతో అమితాబ్ రష్మికకు వీడియో కాల్ చేశాడు. దీంతో రష్మిక ఈ షోలో వీడియో కాల్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.

రష్మిక వీడియో కాల్ లోకి రాగానే ప్రమోద్ భాస్కర్ ఆనందం వ్యక్తపరిచాడు. తెలుగులో రష్మికతో.. ఎలా ఉన్నారు? మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా ఫోన్, ల్యాప్ టాప్, వాట్సాప్ అన్నిట్లో మీ ఫోటోనే వాల్ పేపర్ అంటూ ప్రపోజ్ చేసేశాడు. అయితే రష్మిక వీటిని సరదాగా తీసుకొని.. నేను బాగున్నాను. మీ అభిమానానికి ధన్యవాదాలు. మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. ఇక ప్రమోద్ భాస్కర్ మిమ్మల్ని పర్సనల్ గా కలగాలని ఉంది అని అడగ్గా.. తప్పకుండా కలుద్దాం అని చెప్పింది రష్మిక.

అమితాబ్ రష్మికని అభినందిస్తూ యానిమల్ సినిమాలో బాగా నటించావని చెప్పాడు. ఇక ఈ వీడియో కాల్ అంతా ప్రమోద్ భాస్కర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. అసలు నేను టీవీలోకి వెళ్తాను అని, నా ఫేవరేట్ హీరోయిన్ తో వీడియో కాల్ మాట్లాడతానని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. రష్మికని పర్సనల్ గా కలవాలని ఉందని పోస్ట్ చేశాడు. దీనికి రష్మిక త్వరలో కలుద్దాం అని రిప్లై ఇవ్వడం గమనార్హం.

 

Also Read : Vakkantham Vamsi : బండ్లన్న డబ్బులు ఎగ్గొట్టిన విషయంపై వక్కంతం వంశీ.. టెంపర్ సమయంలో కోర్టు దాకా గొడవ..

  Last Updated: 10 Dec 2023, 05:17 PM IST